Premalu 10 Days Collections.. ప్రేమలు కలెక్షన్ల వర్షం.. 4 కోట్ల బడ్జెట్.. ఎన్ని కోట్ల లాభమంటే?
దక్షిణాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై అద్బుతమైన కలెక్షన్లు సాధిస్తున్న చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన రొమాంటిక్ లవ్ స్టోరిని ప్రముఖ నటుడుు ఫహద్ ఫాజిల్ నిర్మించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి యువ దర్శకుడు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ తదితరులు నటించారు.
ప్రేమలు సినిమాకు సంబంధించిన నిర్మాణ వ్యయం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను మొత్తగా 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను తొలుత మలయాళంలో 250 స్క్రీన్లతో ప్రారంభించి ప్రస్తుతం 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఈ సినిమాను సుమారుగా 100 స్క్రీన్లలో స్క్రీనింగ్ చేస్తున్నారు.

ప్రేమలు చిత్రాన్ని అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రానికి విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా గత 10 రోజుల్లో 1 మిలియన్ డాల్లరు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా భారీ లాభాలను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది.
Recommended Video

ప్రేమలు చిత్రం తొలి రోజు 90 లక్షల రూపాయలతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. మౌత్ పబ్లిసిటీ పెరగడంతో ఈ సినిమా రోజు రోజుకు పెంచుకొంటూ పోయింది. దాంతో తొలివారమే ఈ సినిమా 13 కో ట్ల రూపాయల కలెక్షన్లను ఇండియాలోనే రాబట్టింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్‌లో కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది.

ఇక రెండోవారంలో ప్రేమలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనంగా కనిపించింది. ఈ చిత్రం 8వ రోజు 1.85 కోట్లు, 9వ రోజు శనివారం 3.2 కోట్లు, ఆదివారం 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలోనే ఈ సినిమా 21.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 8.3 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











