Premalu Box Office Collections ప్రేమలు మూవీకి భారీ కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద షాకింగ్‌గా.. ఎన్ని కోట్లంటే?
వాలంటైన్ డే కానుకగా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమలు చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులను భారీగా కురిపిస్తున్నది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నిర్మాతగా మారి నిర్మించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం కేరళ, ఓవర్సీస్‌లో రిలీజైన ఈ చిత్రం మూడో రోజే లాభాల్లోకి ప్రవేశించింది. ఈ సినిమా 6 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరం బ్యాక్ డ్రాప్‌గా బ్రేకప్ అయిన కుర్రాడు.. ఫుల్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ప్రేమకథా చిత్రాన్ని సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కేరళలో భారీగా, ఇతర రాష్ట్రాల్లో పరిమితంగా రిలీజ్ చేశారు. కేరళ, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నది.

ప్రేమలు చిత్రం సుమారుగా 3 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను దాదాపుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా స్టడీగా వసూళ్లు సాధిస్తూ అందర్నీ ఆకట్టుకొంటున్నది.
ప్రేమలు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజున 1 కోటి రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఆ తర్వాత టాక్ పాజిటివ్‌గా మారడంతో 2వ రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 3 కోట్లు వసూలు చేసింది. అదే జోష్‌ను కొనసాగిస్తూ ఈ సినిమా నాలుగో రోజు 1.75 కోట్ల రూపాయలు నమోదు చేసింది. ఇక 5వ రోజు భారీగా అంటే 2.10 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 9 కోట్ల నికరంగా, 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ప్రేమలు సినిమా 6వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఈ సినిమా యావరేజ్‌గా 45 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నది. ఈ సినిమా 6వ రోజున కూడా 1.5 కోట్లు నికరంగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా తొలివారం నిలకడగా వసూళ్లను సాధిస్తూ రెండోవారంలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నది.

ఇక ప్రేమలు సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇప్పటి వరకు ఈ మూవీ ఇండియాలో 10 కోట్లకుపైగా కలెక్షన్లు, అలాగే ఓవర్సీస్‌లో 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు నికరంగా.. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











