SS రాజమౌళి మెచ్చిన చిన్న సినిమాకు భారీ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
మలయాళ సినిమా పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ప్రేమలు చిత్రం రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్నది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ దేశవ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తున్నది. తెలుగు నేటివిటితో రూపొందిన ఈ సినిమా మార్చి 8వ తేదీన డబ్బింగ్ చిత్రంగా రిలీజైంది. ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బాహుబలి, RRR సినిమాలకు పనిచేసిన కార్తీకేయ తొలిసారి డిస్టిబ్యూటర్‌గా అవతారం ఎత్తారు. తన తొలి చిత్రంగా కేరళలో సంచలన విజయం సొంతం చేసుకొన్న ప్రేమలు చిత్రాన్ని నైజాం, ఆంధ్రా, ఓవర్సీస్ మార్కెట్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో తెలుగులో కూడా భారీ కలెక్షన్లు సాధించేందుకు సిద్దమైంది.

ప్రేమలు సినిమా గురించి ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేసి అంచనాలు పెంచారు. కార్తీకేయ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ మూవీని చూసినంత సేపు పొట్ట చెక్కలవుతుందా? అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, లాంగ్వేజ్‌ను పట్టుకొని అద్బుతంగా రచయిత డైలాగ్స్ రాశారు. ట్రైలర్ చూసినప్పడే రీనూ క్యారెక్టర్ నచ్చింది. సచిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ బాగా చేశాడు. ఆది JK నాకు ఫేవరేట్ క్యారెక్టర్ జస్ట్ కిడ్డింగ్ అంటూ రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రేమలు తెలుగు సినిమాకు మంచి టాక్ లభించింది. ప్రీమియర్స్ షోలకు మంచి స్పందన రావడంతో ఆంధ్రా, నైజాంలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు తొలి రోజు సుమారుగా 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ప్రేమలు తెలుగు సినిమాకు ఓవర్సీస్‌లో అంటే ముఖ్యంగా ఉత్తర అమెరికాలో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాను 82 లోకేషన్లలో ప్రదర్శించగా భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ మూవీ తొలి రోజు 19 వేల అమెరికన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1.5 కోట్ల రూపాయలు మేర కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ప్రేమలు సినిమా తొలి రోజు గౌరవప్రదమైన వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో ఈ సినిమా 80 లక్షలు, ఆంధ్రాలో ఈ మూవీ 70 లక్షల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను ఈ చిత్రం రాబడుతున్నది.
ఇక ప్రేమలు సినిమా గత 30 రోజులుగా రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలివారం ఈ సినిమా మలయాళం బాక్సాఫీస్ వద్ద 12.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలివారం కంటే రెండోవారంలో ఎక్కువగా వసూళ్లను నమోదు చేసింది. 2వ వారంలో 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక 3వ వారంలో ఈ సినిమా 10 కోట్ల రూపాయలు, నాలుగో వారం 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











