Premante Closing Collection: ప్రేమంటే క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రియదర్శి మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

కమెడియన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు ప్రియదర్శి పులికొండ. ఈ దశలో మల్లేశం సినిమాతో తనలో కమెడియన్‌తో పాటు నటుడు కూడా ఉన్నాడని చిత్రసీమకు పరిచయం చేశాడు ప్రియదర్శి. ఆ తర్వాత బలగం, కోర్ట్, సారంగపాణి జాతకం, మిత్రమండలి తదితర చిత్రాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. కమెడియన్‌గా ఉంటూనే అప్పుడప్పుడూ హీరోగానూ నటిస్తున్నారు ప్రియదర్శి. తాజాగా ఆయన నటించిన చిత్రమే ప్రేమంటే. నవంబర్ 21న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమంట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ప్రియదర్శి మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

ప్రేమంటే తారాగణం
వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, హీరో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావులు ఈ ప్రేమంటే సినిమాను సంయుక్తంగా నిర్మించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటించారు. స్టార్ యాంకర్ సుమ కనకాల, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రేమంటే సినిమాకు విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సినిమాటోగ్రాఫర్‌గా, రాఘవేంద్ర తరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

Premante Box Office Closing Collections Worldwide How much loss or profit for Priyadarshi Pulikonda s Movie

ప్రేమంటే బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రచార ఖర్చులతో కలిపి ప్రేమంటే సినిమాకు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ప్రేమంటే మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగనట్లుగా వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ + ఓటీటీ రైట్స్ కలిపి 6 కోట్ల రూపాయలు, మ్యూజిక్ రైట్స్ 1.50 కోట్ల రూపాయలు చొప్పున బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రేమంటే మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయలు రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ప్రేమంటే కలెక్షన్స్
ప్రేమంటే సినిమాకు తొలిరోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 35 లక్షల రూపాయలు, మూడో రోజున 35 లక్షల రూపాయలు, నాలుగో రోజున 20 లక్షల రూపాయలు, ఐదో రోజున 20 లక్షల రూపాయలు, ఆరో రోజున 20 లక్షల రూపాయలు, ఏడో రోజున 36 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 2 లక్షల రూపాయలు, తొమ్మిదవ రోజున 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 1.95 కోట్ల రూపాయల నెట్.. 2.24 కోట్ల రూపాయల చొప్పన గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ప్రియదర్శి మూవీకి 15 లక్షల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ప్రేమంటే మూవీకి వరల్డ్ వైడ్‌గా 2.39 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది.

ప్రేమంటే మూవీకి లాభమెంత? నష్టమెంత?
బలగం, కోర్ట్ తర్వాత ఆ స్థాయిలో ప్రియదర్శి మెప్పించలేకపోతున్నాడు, సారంగపాణి జాతకం, మిత్రమండలి చిత్రాలతో ఆయన వరుస ఫ్లాపులను చవిచూశాడు. తాజాగా ప్రేమంటే మూవీ కూడా ప్రియదర్శిని మరోసారి నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 2.40 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. దాంతో దాదాపుగా ఈ సినిమాకు 7 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిల్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ప్రేమంటే చిత్రం విడుదలై దాదాపుగా పది రోజులు కావొస్తోంది. త్వరలో అఖండ 2 వంటి భారీ చిత్రం థియేటర్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రియదర్శి మూవీ బాక్సాఫీస్ వద్ద పుంజుకునే పరిస్ధితి కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా చిన్నా పెద్దా సినిమాలు రావడం కూడా ప్రేమంటే మూవీకి ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ప్రియదర్శి మూవీకి 7 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లుగా చెబుతున్నప్పటికీ... ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులు, డబ్బింగ్ రైట్స్‌తో నిర్మాత ఒడ్డునపడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X