Premante Day 1 Collection: ప్రేమంటే ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రియదర్శి మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
కమెడియన్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు ప్రియదర్శి పులికొండ. కమెడియన్‌తో పాటు సపోర్టింగ్ రోల్స్‌తో తనలోని సత్తాను నిరూపించుకున్నారు. చాలామంది కమెడియన్ల మాదిరిగానే తను కూడా హీరో అయ్యాడు. మల్లేశం సినిమాతో తనలో కమెడియన్‌తో పాటు నటుడు కూడా ఉన్నాడని సినీజనాలకు పరిచయం చేశాడు ప్రియదర్శి. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చేయగలనని నిరూపించాడు. ఆ తర్వాత బలగం, కోర్ట్, సారంగపాణి జాతకం, మిత్రమండలి తదితర చిత్రాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.
ప్రేమంటే తారాగణం
ప్రియదర్శి తాజాగా నటించిన సినిమా ప్రేమంటే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, హీరో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావులు ఈ ప్రేమంటే ఇదేరా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటించారు.

ప్రేమంటే బడ్జెట్ ఎంత?
స్టార్ యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రేమంటే సినిమాకు విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సినిమాటోగ్రాఫర్‌గా, రాఘవేంద్ర తరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. జనవరి 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రేమంటే మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్నికోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే..
ప్రేమంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రచార ఖర్చుతో కలిపి ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే ప్రేమంట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగనట్లుగా వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ + ఓటీటీ రైట్స్ కలిపి 6 కోట్ల రూపాయలు, మ్యూజిక్ రైట్స్ 1.50 కోట్ల రూపాయలు చొప్పున వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రేమంటే మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ప్రేమంటే తొలి రోజు కలెక్షన్స్
ప్రేమంటే చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా బాగానే టికెట్ సేల్స్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నవంబర్ 21న చిన్నా పెద్దా సినిమాలు భారీగా బరిలో దిగుతున్నప్పటికీ ప్రియదర్శి మూవీకి తొలిరోజున బాగానే బుకింగ్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ సినిమాకు తొలి రోజు సాయంత్రం 5 గంటల వరకు 10 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 220 షోలు, బెంగళూరులో 23 షోలు, విజయవాడలో 41 షోలు, విశాఖలో 69 షోలు పడినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ప్రియదర్శి మూవీకి తొలి రోజున 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











