Prince Sardar movies collections: 7వ రోజు కూడా కార్తీ దూకుడు.. ప్రిన్స్ పనైపోయినట్లే?
తెలుగు బాక్సాఫీస్ వద్ద తమిళ హీరోలకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసారి శివకార్తికేయన్ కూడా ప్రిన్స్ సినిమాతో తెలుగులో స్థిరపడాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ అనుకున్నట్లు వర్కౌట్ కాలేదు. ఇక కార్తీ మాత్రం సర్దార్ సినిమాతో పోయిందని అనుకున్న తెలుగు మార్కెట్ ను మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు 7 రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాయి ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

సర్దార్ బిజినెస్
కార్తీ నటించిన సర్దార్ సినిమా తెలుగులో మంచి బిజినెస్ క్రియేట్ చేసింది. గత సినిమాలతో కార్తీ చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. కొన్ని తమిళంలో సక్సెస్ అయినా కూడా తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే సక్సెస్ అయ్యాయి. ఇక సర్దార్ కు ట్రైలర్ ద్వారా క్రేజ్ పెరగడం వలన ఈ సినిమా తెలుగులో 5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో 5.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది.

సర్దార్ 7 డేస్ కలెక్షన్స్
ఇక బాక్సాఫీస్ వద్ద సర్దార్ మొదటి రోజు కాస్త తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నప్పటికి రెండవ రోజు నుంచి పాజిటివ్ టాక్ తోనే సినిమాకు కలెక్షన్స్ పెరిగాయి. ఇక తెలుగులో 7వ రోజు అయితే 25 లక్షల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమా 68 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

సర్దార్ ప్రాఫిట్స్ ఎంతంటే?
సర్దార్ సినిమాతో కార్తీ బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. PS మిత్రన్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రాఫిట్స్ లోనే కొనసాగుతుంది. ఈ వీకెండ్ బుకింగ్స్ బాగుంటే తెలుగులో కోటికి పైగా షేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

ప్రిన్స్ 7వ రోజు కలెక్షన్స్
ఇక శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ 7వ రోజు మరింత తగ్గాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 8 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పెట్టిన పడుబడులకు అయితే ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు మార్కెట్ వద్ద 7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ప్రిన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
ప్రిన్స్ సినిమాకు తెలుగులో ఇప్పటివరకు 2 కోట్ల 45 లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా కలెక్షన్లు ఏమి పెరగలేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా పూర్తిగా నిరహపరిచింది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే ఇంకా 4.63 కోట్ల షేర్ కలెక్షన్లు అందుకోవాల్సి ఉంది. ఇక ఇప్పట్లో అయితే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











