Prince Day 1 collectons శివకార్తీకేయన్ మూవీకి భారీ ఓపెన్సింగ్.. ప్రిన్స్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ, తమిళ సూపర్‌స్టార్ శివకార్తీకేయన్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రిన్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్‌ కలెక్షన్లను నమోదు చేసింది. డాన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రిన్స్ రావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ కనిపించింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ రిపోర్టులు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, స్క్రీన్ కౌంట్ల వివరాల్లోకి వెళితే..

ప్రిన్స్ మూవీ బడ్జెట్, బిజినెస్

ప్రిన్స్ మూవీ బడ్జెట్, బిజినెస్

జాతిరత్నాలు చిత్రంతో ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ పేరు సంపాదించుకొన్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తీకేయన్ మూవీ అనగానే భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లుగా నమోదైంది. బడ్జెట్‌కు తగినట్టుగానే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా క్రేజీగా జరిగింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ 35 కోట్ల మేర జరిగింది.

ప్రీన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ప్రీన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ప్రిన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఓవరాల్‌గా ఈ సినిమా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. తమిళనాడులో 32 కోట్లు, తెలుగులో 6.5 కోట్లు, కర్ణాటకలో 2.5 కోట్లు, కేరళలో 2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1 కోటి బిజినెస్, ఓవర్సీస్‌లో అన్ని భాషల్లో కలిపి 6 కోట్లు నమోదు చేసింది.

ప్రిన్స్ వరల్డ్ వైడ్ స్క్రీన్ కౌంట్

ప్రిన్స్ వరల్డ్ వైడ్ స్క్రీన్ కౌంట్

ప్రిన్స్ సినిమా రిలీజైన స్క్రీన్ల వివరాల్లోకి వెళితే.. శివకార్తీకేయన్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడులో 600 స్క్రీన్లలో రిలీజైంది. ఆంధ్రా, నైజాంలో 290 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 1400 స్క్రీన్లలో రిలీజైంది. అమెరికాలో 157 లోకేషన్లలో రిలీజైంది.

తెలుగు, తమిళంలో అక్యుపెన్సీ

తెలుగు, తమిళంలో అక్యుపెన్సీ

ప్రిన్స్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. చెన్నైలో 42 శాతం, కోయంబత్తూరులో 38, పాండిచ్చేరిలో 57 శాతం, సాలెం 32, దిండిగల్ 34 శాతం, త్రిచూరులో 58 శాతం అక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో హైదరాబాద్‌లో 32 శాతం, గుంటూరులో 40 శాతం, వైజాగ్‌లో 31 శాతం, కాకినాడలో 98 శాతం, నెల్లూరులో 37 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

యూఎస్‌లో ఫస్ట్ డే కలెక్షన్లు

యూఎస్‌లో ఫస్ట్ డే కలెక్షన్లు

ఇక ప్రిన్స్ మూవీ తొలి రోజు యూఎస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 157 లోకేషన్లలో ప్రదర్శించారు. అమెరికాలో తొలి రోజు 34K డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీ పరంగా ఈ సినిమా సుమారు 20 లక్షల షేర్ సాధించింది. విదేశాల్లో ఇతర ప్రాంతాల నుంచి కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో

కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో

ప్రపంచవ్యాప్తంగా ప్రిన్స్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఈ చిత్రం 2 లక్షల వసూళ్లు, ఏపీ, తెలంగాణలో 1.5 కోట్లు, తమిళనాడులో 5.3 కోట్లు, కేరళలో 10 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలు వసూలు చేసింది. ఇండయాలో తొలి రోజు 7.3 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా 8 కోట్లు వసూలు చేసింది.

ప్రిన్స్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ప్రిన్స్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ప్రిన్స్ బ్రేక్ ఈవెన్ లక్ష్యం విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 42 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ సినిమా తొలివారం ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X