Prince Day 3 collectons భారీగా తగ్గిన శివకార్తీకేయన్ కలెక్షన్లు.. మూడో రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?
తమిళనాడులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివకార్తీకేయన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ప్రిన్స్. ఏషియన్ పిక్చర్స్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు, డీ సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి రెండు రోజులు శివ కార్తీకేయన్ క్రేజ్‌తో మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ప్రిన్స్ సినిమా మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

తొలి రెండు రోజుల్లో కలెక్షన్లు
ప్రిన్స్ మూవీ తొలి రోజు తెలుగు, తమిళంలో కలిపి 6.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళంలో 4.95 కోట్లు, తెలుగులో 1.3 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండో రోజు అన్ని భాషల్లో కలిపి 5.6 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 4.9 కోట్లు, తెలుగులో 70 లక్షలతో సరిపెట్టుకొన్నది. దాంతో తొలి రెండు రోజుల్లో 16.85 కోట్లు రాబట్టింది.

తెలుగులో 3వ రోజు వసూళ్లు
ప్రిన్స్ చిత్రం మూడో రోజు సెలవు దినం అయినప్పటికీ వసూళ్లు రాబట్టడంలో తడబాటుకు గురైంది. బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 41 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక ఏపీ, నైజాంలో కలిపి ఈ చిత్రం 2.41 కోట్ల షేర్, 4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

తమిళంలో బెటర్‌గా వసూళ్లు
ఇక తమిళంలో ప్రిన్స్ చిత్రం భారీగానే వసూళ్లను రాబట్టింది. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన మూడో రోజు 5 కోట్ల షేర్ వసూలు చేసింది. తమిళంలోనే ఈ చిత్రం 4.5 కోట్ల షేర్‌ను సాధించింది. సర్దార్ సినిమా నుంచి వస్తున్న పోటీని తట్టుకొని బెటర్ కలెక్షన్లను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

యూఎస్‌ఏలో కలెక్షన్లు
ప్రిన్స్ మూవీ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సర్దార్, ఓరి దేవుడా సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లను సాధించింది. తొలి రెండు రోజుల్లో ప్రీమియర్లతో కలిపి 107k వసూళ్లను రాబట్టిన చిత్రం మూడో రోజు భారీగా కలెక్షన్లను రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం.. 144k కలెక్షన్లను వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్లు
ప్రిన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. గత మూడు రోజుల్లో తెలుగు, తమిళ భాషల్లో 17 కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికాలో కలెక్షన్లు 1.2 కోట్లను కలిపితే.. మొత్తం 18.2 కోట్లు రాబట్టింది. ఇక ముందు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











