Priyadarshi Court Day 2 Collections : ప్రియదర్శి 2వ రోజు కలెక్షన్లు..
రొటీన్ భిన్నంగా చిత్రాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు యంగ్ హీరో ప్రియదర్శి. మల్లేశం, బలగం వంటి చిత్రాలతో ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారో తెలిసిందే. 'సేవ్ ది టైగర్స్' వంటి సిరీస్ తోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరోవైపు భారీ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ప్రియదర్శి మరో డిఫరెంట్ అటెంప్ట్ చేసి విజయవంతమయ్యారు. 'కోర్టు' అనే చిత్రంతో మార్చి14న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. కాగా ఈ చిత్ర కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి.
ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ చిత్రానికి తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.7.8 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.4.15 కోట్ల నెట్, 4.8 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.3 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. మొదటిరోజే కేవలం తెలుగులోనే ఈ చిత్రం రూ.4.15 కోట్ల నెట్ వసూల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక రెండో రోజు రూ.2.17 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసింది. వీటికి మరిన్ని కలెక్షన్లు కూడా కలవాల్సి ఉంది. దాంతో రూ.4 కోట్ల వరకు నెట్, ప్రపంచ వ్యాప్తంగా రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు మాత్రం కోర్టు చిత్రానికి ఇండియాలో రూ.6.32 కోట్ల నెట్ వసూళ్లు అందినట్టు తెలుస్తోంది. రేపటితో మరింత పక్కాగా డే2 కలెక్షన్ల వివరాలు రానున్నాయి. డే2న మార్నింగ్ షోస్ కు 34.05 శాతం, ఆఫ్టర్ నూన్ 55.04 శాతం ఆక్యుపెన్సీ సాధించిందీ చిత్రం. అవరేజ్ గా 44.55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి పెద్దగా పోటీ లేకపోవడంతో కోర్టుకు మంచి కలెక్షన్లు అందే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మున్ముందు ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. నేచరల్ స్టార్ నాని సమర్పించారు. కాగా ఈ చిత్రానికి అన్ని ఖర్చులు కలిపి రూ.10 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఆంధ్రా, నైజాం, సీడెడ్, తూర్పు, కృష్ణ సహా ఇతర ఏరియాల్లో కలిపి రూ.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని అంటున్నారు. మార్చి 14న ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో విడుదల చేయడం విశేషం. ఈ చిత్రం రూ.11 కోట్ల షేర్, రూ.22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ చిత్రంతో హర్ష్ రోషన్, రోహిణి ఇద్దరు యంగ్ టాలెంట్స్ షైన్ అయ్యారు. మరోవైపు సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్, రాజశేఖర్ అనింగి, సురభి, ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానియా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఈ నాని ఈ సినిమాను వీలైనంత మేరకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ తో థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











