ఛార్మి, ప్రియమణి ఎక్సపోజింగ్ ఫ్లాప్

అలాగే కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన సోల్జర్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమవుతోంది.మిలటరీ నుండి వచ్చిన మేజర్ (కృష్ణ) తన కొడుకు దారితప్పాడని తెలుసుకుని, తిరిగి అతనిలో మార్పు తీసుకురావటమే కథాంశం. ఇక ఈ సినిమా అస్సలు రిలీజైందనే సంగతి కూడా ప్రేక్షకులకు తెలియనీయకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్తపడటం ప్రేక్షకులకు అదృష్టంగా మారింది. ఆలాగే..శివాజీరాజా ప్రధాన పాత్రలో మొండి మొగుళ్ళు,పెంకి పెళ్ళాలు అనే కామిడీ సినిమా రిలీజైంది. ఎక్కడా నవ్వురాకుండా సన్నివేశాలు రూపకల్పన చేయటంతో సినిమా చూస్తున్నంతసేపూ సీరియస్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగించారని టాక్.
గత వారం రెండు పోలీసు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి బాలీవుడ్ ఖాఖీ రీమేక్ సత్యమేవ జయితే, మరొకటి అబ్ తక్ చప్పన్ రీమేక్ సిద్దం. అయితే ఈ రెండు సినిమాలూ భాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. జెడి దర్శకత్వంలో వచ్చిన సిద్దంలో జగపతిబాబు హీరోగా చేసారు. ఒక్క పాట, కామెడీ ట్రాకూ లేకుండా తీసాడు. అయినా కథనం మరీ స్లోగా ఉండటం, హీరోకి ఎక్కడా సమస్య రావటం, ఎదుర్కొవటం అనేది లేకుండా చాలా భాగం నడవటం ప్రేక్షకులని సహనపరీక్షలో పడేసాయి.
ఇక అంతకు ముందు రిలీజైన కొంచెం ఇష్టం..కొంచెం కష్టం..ధియోటర్ల వద్ద చాలా కష్టంగా ఉంది. బాలా నేనే దేముడ్ని సినిమా చూసిన వారికి నిజంగా దేముడు కన్పడనుండటంతో దానికీ ప్రేక్షకాదరణ లేదు. అరుంధతే ఇప్పటికీ టాప్ ఛెయిల్ లో ఉంది. అందాలు పరిచిన ప్రియమణి, ఛార్మి మ్యాజిక్ వర్కవుట్ కాకపోవటం, అనూష్క హవా మార్కెట్ లో కొనసాగటం అందరినీ ఆలోచనలో పడేస్తున్న అంశం.


Click it and Unblock the Notifications











