'ఎవరే అతగాడు' సినిమాతో పరిచయమై 'పెళ్ళయిన కొత్తలో' తో అందరికీ ప్రియమైన సుందరి ప్రియమణి.ఈ అందం 'యమదొంగ' తరువాత అరుదైపోయిందని అభిమానులు వాపోతున్నారు.కారణం ఆమె అందరిలాగే హిట్టుని క్యాష్ చేసుకునే ప్రోసస్ లో పారితోషికం పెంచిందని సమాచారం.కాదు తమళంలో బిజీగా ఉంది అందుకే కొద్దిగా ఈ గ్యాప్ అంటున్నారు ఆమె శ్రేయాభిలాషులు.తాజాగా టీవి5, సాయి కృష్ణ ప్రొడక్షన్స్ కలసి నితిన్ హీరోగా నిర్మిస్తున్న 'ద్రోణ' అనే సినిమాలో బుక్కయింది. రాజమౌళి దగ్గర సహాయకుడుగా చేసిన కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా లో 'ఆటాడిస్తా' లో ప్రతినాయకుడు గా అదర కొట్టిన మాజీ మంత్రి శివ ప్రసాద్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు.ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభమౌతుంది.అంటే త్వరలో మళ్లీ ప్రియమణి కనువిందు చేయబోతోందన్నమాట.