twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుడు సినిమాకు 80% లాస్... మహేష్ బాబు మాత్రమే డబ్బులు వెనక్కి ఇచ్చాడు: సీనియర్ నిర్మాత

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు హిట్టయితే లాభాల వల్ల నిర్మాతలు స్థాయి పెరగవచ్చు పెరగకపోవచ్చు. కానీ డిజాస్టర్ అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ మాములుగా ఉండదు. తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే నిర్మాతలు నష్టపోతే ఆదుకునే హీరోలు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక వరుడు సినిమాతో భారీగా నష్టాలను ఎదుర్కొన్న ఒక నిర్మాతకు మహేష్ బాబు మాత్రమే సహాయం చేసినట్లు ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు

     కొందరు అగ్ర హీరోలు మాత్రమే

    కొందరు అగ్ర హీరోలు మాత్రమే

    ఒక సినిమా హిట్టయితే క్రెడిట్ అందరికి దక్కుతుంది. ఇక ప్లాప్ అయితే మాత్రం నిర్మాత జేబులు ఖాళీ అయినట్లే. దర్శకుడు నటీనటులు ఆర్థికంగా బాగానే ఉంటారు. కానీ డబ్బులు పెట్టిన నిర్మాతను చాలా వరకు ఎవరు పట్టించుకోరు. కొందరు అగ్ర హీరోలు మాత్రమే చాలా సందర్భాల్లో డబ్బును వెనక్కి ఇచ్చేస్తుంటారు. అలాంటి వారిలో రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉన్నారు.

    వరుడు సినిమాతో నష్టాలు

    వరుడు సినిమాతో నష్టాలు

    వరుడు సినిమాతో దాదాపు 80% నష్టపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక నామ తెలియజేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఆ సినిమా కోసం వందల సంఖ్యలో

    ఆ సినిమా కోసం వందల సంఖ్యలో

    ఆ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. యూనివర్సల్ ప్రొడక్షన్ లో డివివి.దానయ్య సినిమాను నిర్మించగా దర్శకుడు గుణశేఖర్ ఖరీదైన సెట్స్ తో సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కోసం వందల సంఖ్యలో రియల్ ఫ్యామిలీ మెంబర్స్ ను సెలెక్ట్ చేశారు. ఇక హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

     పెద్ద ప్రయోగమే చేశారు.

    పెద్ద ప్రయోగమే చేశారు.

    సినిమా విడుదలైన తరువాత గాని హీరోయిన్ మొహాన్ని చూపించకుండా దర్శకుడు పెద్ద ప్రయోగమే చేశారు. కానీ సినిమాలో ఆర్య విలన్ క్యారెక్టర్. మణిశర్మ మ్యూజిక్ తప్పితే ఏది క్లిక్కవ్వలేదు. డివివి దానయ్య రిస్క్ చేయలేక సినిమా థియేట్రికల్ హక్కులను అభిషేక్ ప్రొడక్షన్ కు అమ్మేశారు.

    30కోట్లకు పైగానే ఖర్చు చేయగా

    30కోట్లకు పైగానే ఖర్చు చేయగా

    సినిమా కోసం దాదాపు 30కోట్లకు పైగానే ఖర్చు చేయగా అభిషేక్ నామ సినిమా రిలీజ్ హక్కులను అంతకంటే ఎక్కువ ఎమౌంట్ కు దక్కించుకొని భారీగా రిలీజ్ చేశారు. కానీ మొదటి షోతోనే రిజల్ట్ అర్థమైపోయింది. సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఆయన 80% వరకు నష్టపోవాల్సి వచ్చినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

    Recommended Video

    Aishwarya Rai Assets More Than Abhishek Bachchan
    మహేష్ మాత్రమే..

    మహేష్ మాత్రమే..

    అలాగే మహేష్ బాబు గురించి కూడా మాట్లాడిన అభిషేక్ ఆయన సినిమాలను కొనుక్కొని రిలీజ్ చేసినప్పుడు కూడా కొన్ని దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అప్పుడు మహేష్ పిలిచి ఆర్థికంగా కొంత సపోర్ట్ చేయడమే కాకుండా తరువాత మంచి సినిమాలు ఇప్పించినట్లు అభిషేక్ వివరణ ఇచ్చారు. ఆవిధంగా ఇండస్ట్రీలో తనకు నష్టపోయిన సమయంలో మహేష్ మాత్రమే హెల్ప్ చేసినట్లు చెప్పారు.

    English summary
    Abhishek also talked about Mahesh Babu and when he bought and released his films, there were some bad disasters. Then Mahesh called and offered some financial support and later Abhishek explained that he had given good movies. Thus Mahesh says he was the only one who helped at a time when he was losing money in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X