twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR శక్తి సినిమాకు వచ్చిన నష్టం కోలుకోలేనిది.. అమ్మవారితో రిస్క్ అని రజనీకాంత్ ముందే చెప్పారు..

    |

    కొన్ని సినిమాలు విడుదలకు ముందు ఏ స్థాయిలో భజ్ క్రియేట్ చేస్తాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అగ్ర హీరోలు భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చినప్పుడు షూటింగ్ దశలోనే అభిమానుల్లో అంచనాల స్థాయిని ఆకాశానికి దాటించేస్తాయి. అయితే అలా క్రియేట్ చేసి వచ్చిన సినిమాల్లో చాలావరకు బోల్తాకొట్టినవే ఎక్కువ. అలా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయినవి చాలానే ఉన్నాయి. అందులో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా కూడా ఉంది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఇలియానా, మంజరి ఎన్టీఆర్ కు జోడీగా నటించారు.

    ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో నిర్మించగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. అంతకుముందు ఇదే కాంబినేషన్ లో వచ్చిన కంత్రి సినిమా కూడా యవారేజ్ హిట్ గా నిలిచింది. ఇక శక్తి సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కొందరు మాత్రం రిస్క్ చేస్తున్నావని నిర్మాత అశ్విని దత్ తోనే డైరెక్ట్ గా చెప్పారు. అందులో రజినీకాంత్ కూడా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో సినిమా మిగిల్చిన నష్టాల పై అశ్వినిదత్ వివరణ కూడా ఇచ్చారు.

    Producer c adhwini dutt about Jr ntr shakthi movie losses

    మహాశక్తి పీఠాలకు అధిపతి అయిన అమ్మవారి విగ్రహంను సంరక్షించి యోధుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించాడు. అయితే ఎంతో నిష్ఠగా ఉండవలసిన అమ్మవారి కథలను ఈ పద్ధతిలో తెరకెక్కించడం ఒక మంచిది కాదని వైజయంతి నిర్మాత సి.అశ్వనీదత్ కు కొందరు సెలబ్రిటీలు వివరణ ఇచ్చారు. ఎక్కువగా రిస్క్ చేయొద్దని రజినీకాంత్ కూడా నిర్మాతకు ఫోన్ చేసి మరి చెప్పారట. అశ్విని దత్ అంటే అంటే సూపర్ స్టార్ కి ప్రత్యేకమైన గౌరవం ఉండటం వలన ఆ విషయం చెప్పి ఏదైనా హోమాలు పూజలు చేయమని కూడా సలహా ఇచ్చారట. ఆ విషయాన్ని అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    అయితే అప్పటికే సినిమాని సెట్స్ పైకి తేవడం వలన ఆ సినిమాను తప్పక పూర్తి చేయాల్సి వచ్చిందని అన్నారు. సినిమాను 40 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించగా 25 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందని తెలియజేశారు. 50 ఏళ్ల వైజయంతి మూవీస్ ప్రస్థానంలో భారీగా నష్టాన్ని కలిగించిన సినిమా శక్తి అని అశ్వినీదత్ తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఈ నిర్మాత ఏడేళ్ల వరకు వైజయంతి మూవీస్ లో సినిమాలు నిర్మించలేదు. స్వప్న సినిమాస్ లోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నిర్మించారు.

    2018లో నాగార్జున, నాని లతో కలిసి దేవదాస్ అనే సినిమాను నిర్మించారు. అనంతరం 2019 లో మహేష్ బాబు తో మహర్షి సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలేవీ కూడా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేదు. మధ్యలో మహానటి సినిమా స్వప్న సినిమాస్ లోనే తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాను ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ సినిమా 2024లో థియేటర్స్ లోకి రావచ్చని సమాచారం.

    English summary
    There are a lot of disasters at the box office. It also includes the Shakti movie starring NTR. The film, which came out in 2011, stars NTR in two different roles. Ileana and Manjari are paired with NTR. Producer c adhwini dutt about Jr ntr shakthi movie losses
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X