twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sitaramam అసలు బడ్జెట్ పై నిర్మాత కామెంట్.. మొత్తం ప్రాఫిట్ ఇంతే అంటూ..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో సీతారామం సినిమా టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హను రాగవపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇక ఈ చిత్ర నిర్మాత సి.అశ్విని దత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అసలు బడ్జెట్ గురించి అలాగే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ గురించి కూడా తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    పెద్దగా మార్కెట్ లేకపోయినా

    పెద్దగా మార్కెట్ లేకపోయినా

    తెలుగులో దుల్కర్ సల్మాన్ కు పెద్దగా మార్కెట్ లేకపోయినా సీతారామంలో అతని నటన వలనే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇదివరకే కొంత దుల్కర్ సల్మాన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. మహానటి సావిత్రి బయోపిక్ లో అతను జెమినీ గణేషన్ పాత్రలో నటించే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. ఆ తర్వాత అతని మలయాళం డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది.

    అలాంటి విజయం

    అలాంటి విజయం

    ఇక సీతారామం సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఆ సినిమా దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన విధానం ఒక్కసారిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మొత్తం థియేటర్లకు వెళ్లేలా చేసింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ స్థాయిలో ఫ్యామిలీ ఆడియెన్స్ చూసిన సినిమాగా కూడా సీతారామం ఒక రికార్డు క్రియేట్ చేసింది.

     ఓటీటీ లో కూడా

    ఓటీటీ లో కూడా

    రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పటికీ కూడా సినిమా అక్కడక్కడ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉండడం విశేషం. ఇక ఓటీటీలో విడుదలయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ముందు వరకు థియేటర్లలో సినిమాను ఎంతమంది చూశారో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఓటీటీలో చూసినట్లుగా అశ్వినీదత్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    బడ్జెట్ ఎంతంటే

    బడ్జెట్ ఎంతంటే

    ఇక ఈ సినిమా బడ్జెట్ లెక్కల గురించి సోషల్ మీడియాలో అలాగే పలు వెబ్ సైట్ లలో అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే మొదటిసారి చిత్ర నిర్మాత అశ్విని దత్ కూడా సినిమా కోసం పెట్టిన పెట్టుబడి ఎంత అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఈ సినిమా కోసం కాంప్రమైజ్ కాకుండానే ఖర్చు చేసినట్లుగా చెబుతూ మొత్తంగా 51 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లుగా వివరణ ఇచ్చారు.

    వచ్చిన ప్రాఫిట్

    వచ్చిన ప్రాఫిట్

    దుల్కర్ సల్మాన్ కు ఇంతకుముందు తెలుగులో మహానటి తప్పితే అసలు సోలుగా ఒక్క సక్సెస్ కూడా లేదు. అతను సోలోగా ఇక్కడ సినిమాలు కూడా చేసింది లేదు. ఇక మృనల్ కూడా చాలావరకు తెలుగులో కొత్తగా పరిచయం అవుతున్న హీరోయిన్. అలాంటి వారితో సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకోవడం నిజంగా ఆనందంగా ఉంది అని ఈ సినిమా మొత్తంగా పెట్టిన పెట్టుబడికి ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం పది నుంచి 11 కోట్ల మధ్యలో ప్రాఫిట్ అందించినట్లుగా కూడా అశ్వినీ దత్ వివరణ ఇచ్చారు.

    English summary
    Producer c ashwini dutt latest clarifications on sitaramam movie budget and profits
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X