ఫేక్ కాదు... ఒరిజినల్: ‘భరత్ అనే నేను’ కలెక్షన్లు ప్రకటించిన దానయ్య
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి నిర్మించిన చిత్రం 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలోహైదరాబాద్ నోవాటెల్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర కలెక్షన్లపై స్పష్టమైన ప్రకటన చేశారు.
మా 'భరత్ అనే నేను' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 161.28 కోట్లు వసూలు చేసింది. ఇది ఏ మాత్రం ఫేక్ రికార్డ్స్ కాదు. ఒరిజినల్ కలెక్షన్. మా చిత్రం తొలి వారం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది అని దానయ్య స్పష్టం చేశారు.
తమ సంస్థకు ఇంత పెద్ద విజయం ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు కొరటాల శివగారికి, హీరో మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు దానయ్య పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. టెన్షన్ టెన్షన్ గా షూటింగ్ జరిగింది. లొకేషన్ షిప్టుంగులు చాలా జరిగాయి. ఆ సమయంలో నేను ఏదైనా మాట అని ఉంటే వారు ఏమీ అనుకోకుండా కష్టపడ్డారు. వారందరికీ ఈ సందర్భంగా సారీ చెబుతున్నట్లు దానయ్య ప్రకటించారు.
ఈ సినిమాను ఇంత గొప్ప సినిమా అని ఎందుకు అంటున్నానంటే తనకు ఏ సినిమాకు ఇంత అప్రిషేషన్ రాలేదు, పెద్ద చిన్నా తేడా లేకుండా చాలా గొప్ప సినిమా తీశారని అభినందించారు. నాతో సెల్పీలు తీసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో మాటలు రావడం లేదు అని దానయ్య అన్నారు.


Click it and Unblock the Notifications











