twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Home

    By Staff
    |

    సెప్టెంబర్‌ ద్వితీయార్ధంలో ఇప్పటికి అయిదు చిత్రాలు విడుదలయ్యాయి. రామ్‌గోపాల్‌ వర్మ శివ 2006, శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ్జ్ట రూపొందించిన దొంగోడి పెళ్లి, కొత్త డైరెక్టర్‌ కె. సతీశ్‌ రూపొందించిన సందేశాత్మక చిత్రం హోప్‌, యలమంచి శేఖర్‌ తొలిసారి స్వీయదర్శకత్వంలో నిర్మించిన గంగ, మళయాల డబ్బింగ్‌ చిత్రం సేనాపతి.

    వీటిలో వర్మ ఫ్యాక్టరీ ఉత్పాదన - శివ 2006 ఫస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం పాత శివతో పోలిస్తే.. కథాపరంగా కొత్త శివలో కొత్తదనం పెద్దగా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు, వర్మ టేకింగ్‌ స్టయిల్‌, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ వంటి అంశాలు మాస్‌ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి అంటున్నారు. ఈ చిత్రం పాత శివలా సంచలనం కాకపోయినా మాస్‌ ప్రేక్షకులకు మాత్రం పైసా వసూల్‌ చిత్రం అవుతుందని, వర్మ అభిమానులకు ఇది విజువల్‌ ఫీస్ట్‌ అందిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే శివ 2006కి దేశవ్యాప్తంగా మంచి పబ్లిసిటీ కూడా లభించింది. పోలీసులే నేరస్థులైతే.. అన్న క్యాప్షన్‌పై రాష్ట్ర పోలీస్‌ వర్గాల్లో కొంత అసంతృప్తి రేగడం, మీడియా దానికి ప్రచారం కల్పించడంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. హీరో మోహిత్‌ అహ్లావత్‌ నటన ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉండగా, హీరోయిన్‌ నిషా కొఠారి అందాలు మాత్రం ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి. శివ 2006 చిత్రాన్ని వర్మ ఏ ప్రయోజనంతో రూపొందించారో.. అది కొంతమేరకు సఫలం అవుతుందని ట్రేడ్‌ టాక్‌.

    యలమంచి శేఖర్‌ మొట్టమొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, దర్శకత్వం కూడా చేపట్టి రూపొందించిన సందేశాత్మక చిత్రం గంగ. పల్లెటూళ్లలో ఇప్పటికి ప్రబలంగా ఉన్న జోగినీ అనే మూఢాచారం చుట్టూ అల్లిన కథకు మంచి సందేశం కూడా జతచేసి, కేవలం ఆ పాయింటుతోనే కాకుండా జనరల్‌గా మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా స్పశించారు. ఇది బి, సి సెంటర్లలో మహిళా ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని ట్రేడ్‌ విశ్లేషకుల అభిప్రాయం. స్వతహాగా పాత్రికేయుడైన శేఖర్‌ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో సన్నివేశాలు చిత్రీకరించిన తీరు, అందెశ్రీ పల్లెపదాలతో అల్లిన పాటలు, కోటి సంగీతం ఈ చిత్రానికి ఒక స్థాయిని కల్పించాయని చెబుతున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించినా క్వాలిటీ పరంగా ఎక్కడా నాణ్యత లోపించకుండా తీసిన ఈ చిత్రం వినోదాత్మక చిత్రాల కోవలోకి రాకపోయినా మంచి చిత్రంగా కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.

    సెప్టెంబర్‌ 15న విడుదలైన చిత్రాలలో మరొకటి హోప్‌. ఎన్‌ఆర్‌ఐ హరనాథ్‌ పొలిచెర్ల నిర్మాణ సారథ్యంలో కె. సతీశ్‌ (సత్యనారాయణ) దర్శకత్వంలో రామానాయుడు, కల్యాణి నటించిన ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రసాద్స్‌, పివిఆర్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్లలో మాత్రమే విడుదలైనా మంచి చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ చిత్రం కూడా దర్శకుడు సతీష్‌కు మొదటి చిత్రం అయినా ఎంతో పరిణితి ఉన్న దర్శకుడిలా ఆయన హోప్‌ని మలచిన తీరు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

    ఒక పక్క కొత్త దర్శకులు కొత్త పాయింట్లతో ప్రేక్షుకలకు కొత్త అనుభూతి కల్పిస్తున్న నేపథ్యంలో వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇంకా మూస సబ్జెక్టులనే ప్రేక్షకులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న తీరు విచారం కలిగిస్తుంది. తాజాగా కోడి రామకృష్ణ తీసిన దొంగోడి పెళ్లి చిత్రం విడుదలైన మొదటి రోజే నిరాశపర్చింది. ఆ చిత్రంలో హీరో రాజేంద్రబాబు ఇంతవరకూ సైడ్‌ క్యారెక్టర్‌ పాత్రలే పోషిస్తూ వచ్చారు. ఇక హీరోయిన్లు ఇద్దరూ కొత్త అమ్మాయిలే. కథాకథనాలు పాత కంపు కొడుతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించే అవకాశాలు లేవని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X