6 రోజుల్లో 3100 కోట్ల కలెక్షన్లు.. మిక్స్‌డ్ టాక్‌లో బాక్సాఫీస్‌ను రఫాడిస్తూ..
అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నది. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2021లో ఆండీ వీర్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఆమీ పాస్కల్, ర్యాన్ గోస్లింగ్, ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్, ఆదిత్య సూద్ నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రేయిగ్ ఫ్రేజర్ సినిమాటోగ్రఫి, జోయల్ నెగ్రాన్ ఎడిటింగ్, డేనియల్ పెంబెర్టన్ మ్యూజిక్ అందించారు. లార్డ్ మిల్లర్ ప్రొడక్షన్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

స్పేస్ ట్రావెల్, సోలార్ సిస్టమ్ నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాను భారీగా ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లతో నిర్మించారు. భారతీయ కరెన్సీలో ఈ ప్రాజెక్ట్ విలువ సుమారుగా 1900 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాపై సాహితీ ప్రియులే కాకుండా సినిమా అభిమానులు కూడా ఆసక్తి చూపడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయింది.
ఈ మూవీకి భారతీయ ప్రేక్షకుల నుంచి మీడియం రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఓ పక్క ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగుతున్నప్పటికీ.. ఈ సినిమాకు ఫర్వాలేదనే విధంగా కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు 2.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.47 కోట్ల రూపాయలు, మూడో రోజు 5.52 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 5.7 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2.7 కోట్ల రూపాయలు, ఆరో రోజు 3.53 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ డేటా వెల్లడించింది. గత వారం రోజుల్లో ఈ సినిమా 24 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది.
ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. కెనడా, అమెరికాల కలిపి 1700 కోట్ల రూపాయలు, ఇతర దేశాల్లో 1400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 322 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేట్రికల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది అనే మాట ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











