Prabhas సినిమాలో కమల్ హాసన్ విలన్.. వంద కోట్లకు పైగా రెమ్యునరేషనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 500 కోట్ల బడ్జెట్ ఉంటుందని అంచనా.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా స్వప్న దత్ క్లారిటీ ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని, అంతా మోషన్ క్యాప్చర్ లో షూటింగ్ జరుగుతూ ఉందని తెలుస్తోంది. అధిక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి 12న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Prabhas

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన ఒక న్యూస్ కోలీవుడ్ సర్కిల్ లో వైరల్ గా మారింది. ప్రాజెక్ట్ కె మూవీలో విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడంట. ఇక ఆయన కనిపించేది 30 నిమిషాలలోపేనని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ పాత్ర కోసం కమల్ హాసన్ కి ఏకంగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ క్రింద ఇచ్చారని జోరుగా టాక్ వినిపిస్తోంది.

కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ లో భాగం అయితే కచ్చితంగా సినిమాకి పెద్ద అసెట్ అవుతుంది. మార్కెట్ పరంగా కూడా కమల్ హాసన్ నటిస్తున్నట్లు ప్రచారం చేస్తే ప్రాజెక్ట్ కె మూవీకి ఊహించని స్థాయిలో హైప్ వస్తుంది. ఈ అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోరు. అయితే కోలీవుడ్ సర్కిల్ లో అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఎక్కువగానే ప్రచారం అవుతోంది. ఓ యుట్యూబ్ లో దీనికి సంబందించిన న్యూస్ ఫస్ట్ ప్రసారం అయ్యింది. ఆపై అదికాస్తా వైరల్ అయ్యింది. అయితే కేవలం హైప్ కోసమే ఈ గాసిప్ ని తెరపైకి తీసుకొచ్చారా లేదంటే ప్రాజెక్ట్ కెలో నిజంగానే కమల్ హాసన్ నటిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X