2022 Sankranthi movies: పవన్‌ కల్యాణ్‌తో పోటీకి సిద్దమైన అల్లు అర్జున్, నాని.. మెగా హీరో కూడా..

కరోనా వైరస్ వలన ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలపై భారం పడినట్లయ్యింది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో రిలీజ్ డేట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ తప్పదని క్లియర్ గా అర్ధమవుతొంది. ఇక 2022 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ ఫైట్ గట్టిగానే ఉంటుందని టాక్ అయితే వస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి. ఆ సినిమాలపై ఒక లుక్కేస్తే..

పవన్, మహేష్ వస్తారని అనుకుంటే..

పవన్, మహేష్ వస్తారని అనుకుంటే..

అసలైతే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే ఒక విధంగా ఇండస్ట్రీలో వాతావరణం చాలా క్లియర్ గా ఉండేది. కానీ ఒక్కసారిగా మళ్ళీ కరోనా ప్రభావం చూపడంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అసలైతే 2022 సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాటతో పాటు పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాలు రావాలి. కానీ ఇప్పుడు ఆ సినిమాలు వాయిదా పడ్డాయి.

 పవన్ కళ్యాణ్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ ఫిక్స్

వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు రాడని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వస్తాడట. హరిహర వీరమల్లుతో కాకుండా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేజ్ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితులు బాగుండి ఉంటే ఈ సినిమా ఈ దసరా సమయంలోనే వచ్చి ఉండేది.

అల్లు అర్జున్ కూడా సిద్ధమయ్యాడు

అల్లు అర్జున్ కూడా సిద్ధమయ్యాడు

ఇక పవన్ కళ్యాణ్ - రానా సినిమా వస్తోంది అంటే సంక్రాంతికి ఇతర హీరోలు రావడానికి కొంత ఆలోచిస్తారు. కానీ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2020 ఆగస్ట్ 13న రావాల్సిన ఫస్ట్ పార్ట్ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

 గెలిచే హీరో ఎవరు..?

గెలిచే హీరో ఎవరు..?

ఇక నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ కూడా వచ్చే సంక్రాంతికి రావడం పక్కా అని టాక్ వస్తోంది. అదే విధంగా మరొక మెగా హీరో వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి చేసిన F3 సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవడం కాయంగా కనిపిస్తోంది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఫెస్టివల్ సీజన్ ను స్పెషల్ గా టార్గెట్ చేసినట్లు సమాచారం. మరి మొత్తంగా 2022 సంక్రాంతి ఫైట్ లో ఏ హీరో మొదటి స్థానంలో నిలుస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X