'పులి' కొత్త రికార్డు

By Staff

Puli
పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న 'పులి' సినిమా ఇప్పుడు ట్రేడ్ లో ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంది.ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ని దాదాపు ఐదు కోట్లకు ఓ లీడింగ్ ఛానల్ వారు తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.ఇప్పటికే పవన్ జల్సా శాటిలైట్ రైట్స్ పెద్ద మొత్తానికి అమ్ముడయి సంచలనం సృష్టించగా ఇప్పుడీ వార్త అందరినీ షాక్ కి గురిచేస్తోంది.

షూటింగ్ జర్గుతుండగా ఈ రేటు పలకటం దర్శక,నిర్మాతలను ఆనందానికి గురిచేస్తోంది.మరో ప్రక్క ఇదే నిర్మాత సింగనమల రమేష్.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న వరుడు సినిమాకు ఐదు కోట్లుకు మించి డిమాండు చేస్తున్నట్లు సమాచారం.అయితే లీడింగ్ ఛానెల్స్ వేలం పాట రేంజిలో రేట్లు పెంచుకుంటూ వెళ్ళటం నిర్మాతకు బాగా కలిసివస్తోందనేది సత్యం.

అలాగే శ్రీను వైట్ల నాగార్జున కాంబినేషన్ లో రూపొందుతున్న కింగ్ చిత్రం కూడూ నాలుగున్నరకు శాటిలైట్ రైట్స్ అడుగుతున్నారుట.ఎందుకంటే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాలు టీవీ లో వేసినప్పుడు టీఆర్ పి రేటింగ్ లు విపరీతంగా రావటంతో యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తాయి.ఎవరు బిజెనెస్ వారిది.

కామన్ ప్రేక్షకుడు మాత్రం కామ్ గా అప్పుడే కొత్త సినిమా టీవీలో వేసేస్తున్నారా అని ఆశ్చర్యపోతూ ఎంజాయ్ చేస్తూ చూస్తూంటాడు.అందులో ఈ క్రేజీ సినిమాలు నిడివి రెండుం పావు అయితే మినిమం ఐదు గంటలు పాటు టీవీలో ప్రదర్శిస్తూంటారు.ఇక ఈ రకంగా శాటిలైట్ రేట్స్ పెరుగుతూ వెళితే రజనీకాంత్ శివాజీ (పది కోట్లు..కళింగర్ టీవీ)ని బ్రేక్ చేస్తారనటంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X