twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క కూడా సేవ్ చేయలేకపోయింది(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    ఎప్పటిలాగే ఈవారం ప్రేక్షకుల తీర్పును కోరుతూ రెండు తెలుగు సినిమాలతోపాటు ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా థియేటర్లలోకి దిగింది.మొదటగా తెలుగు స్టైయిట్ చిత్రం చూస్తే...జగపతి బాబు, విమలా రామన్ జంటగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన 'చట్టం". ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినా జనాలు మాత్రం ధియోటర్స్ వైపు వెళ్ళటంలేదు. పేపర్లో డైలీ కనిపించే సమకాలీన సమస్యలను వరసగా కూర్చుకుంటూ పోవటమే ఈ చిత్రానికి మైనస్ గా మహా నసగా మారిందంటున్నారు.ఇక ఆ మధ్యన ఎల్ బి శ్రీరాం నటించిన'సొంతవూరు"చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు నంది అవార్డులు అందుకున్న దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం 'గంగపుత్రులు"కూడా ఈ వారమే విడుదలైంది. మత్స్యకారుల జీవితాలను తెరకెక్కించిన తీరు బాగానే వుందనిపించినా సినిమా ఏ వర్గానికీ ఎక్కటం లేదు.అవార్డుల కోసమే తీసినట్లున్న ఈ చిత్రం వారినైనా మెప్పిస్తుందేమో చూడాలి. ఇక విజయ్, అనుష్క జంటగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'పులివేట"విడుదలైంది. అనుష్క కి తెలుగులో ఉన్న మార్కెట్ ను క్యాష్ చేసుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం బోల్తా కొట్టింది.తమిళంలోనే డిజాస్టర్ గా మారిన ఈ చిత్రం ఇక్కడా అదే పరిస్ధితిని ఎదుర్కుంది.

    English summary
    Vijay and Anushka starrer Tamil film ‘Vettaikaaran’ is dubbed into Telugu as ‘Puli Veta’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X