పునీత్ కి ఘనమైన నివాళి.. కన్నడ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన జేమ్స్.. బాహుబలిని దాటేసి మరీ!
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున హీరోలు తరలి వెళ్లి పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఒక స్టార్ అయినప్పటికీ ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. అయితే పునీత్ చివరి చిత్రం "జేమ్స్" మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఓ పండగలా
గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధ పడిన పరిస్థితి కనిపించింది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ జేమ్స్ సినిమాను ఓ పండగలా సెలెబ్రేట్ చేసుకోవాలని కన్నడ ఇండస్ట్రీ డిసైడ్ అయింది.

స్టేట్ మొత్తం
అందుకే ఈ సినిమాకి పోటిగా మరే సినిమా ఉండకూడదు అని పునీత్ రాజ్ కుమార్...పుట్టిన రోజు అయిన మార్చి 17 నుంచి వారం పాటు మరో సినిమా ఉండకూడదు అని స్టేట్ మొత్తం ఈ సినిమానే అన్ని థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తున్నారు... ఇక అశేష అభిమానులు సినీ ప్రేక్షకులు థియేటర్స్ లో చివరి సారి పునీత్ రాజ్ కుమార్ ని చూడటానికి భారీ సంఖ్యలో థియేటర్ కి తరలి వస్తున్నారు,

ఓవరాల్ గా
ఈ దెబ్బతో ఓపెనింగ్ పరంగా అన్ని కన్నడ సినిమాల రికార్డులు తిరగరాసి ఇప్పుడు ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ తో పునీత్ రాజ్ కుమార్ పేరిట కొత్త రికార్డ్ ఏర్పడిందని అంటున్నారు. గతంలో కన్నడ సినిమాల పరంగా KGF చాప్టర్ 1 సినిమా 16.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా అన్ని సినిమాల పరంగా చూసుకుంటే బాహుబలి 2 సినిమా 19.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాప్ లో నిలబడింది.

26 కోట్ల గ్రాస్
ఇక ఇప్పుడు ఈ రికార్డును కూడా జేమ్స్ సినిమా బద్దలు కొట్టిందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ అంచనాల మేరకు మొదటి రోజు ఈ సినిమా 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఫైనల్ లెక్కలు క్లియర్ గా ఇంకా విడుదల కాలేదు కానీ ఈ అంచనాలు ఏమాత్రం నిజమైనా కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ బద్దలు అయినట్టే చెప్పాలి. ఇక జేమ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 35 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం.

విలన్ గా
'జేమ్స్' సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించారు. అలాగే మన హీరో శ్రీకాంత్ ఆ సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపే వ్యక్తి పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











