పూరీ 'బుడ్డా' కలెక్షన్స్ ఎలాగున్నాయి?
పూరీ జగన్నాధ్ తాజా చిత్రం 'బుడ్డా' రివ్యూలు బాగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కలెక్షన్స్ మాత్రం ఆ రేంజిలో లేవు. చాలా పూర్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి పోటీగా రిలీజైన డిల్లీ బెల్లీ మాత్రం కలెక్షన్స్ లో అదరకొడుతోంది. దాదాపు 1200 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎనభై పర్శంట్ వరకూ షేర్ కలెక్ట్ చేసింది. అయితే బుడ్డా చిత్రం మాత్రం కేవలం ధర్టీ పర్శంట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అయితే ఇంత పూర్ కలెక్షన్స్ రావటానికి కారణం పూరీ జగన్నాధ్ అంటున్నారు. పూరీ జగన్నాధ్ అక్కడ ఎవరికీ తెలియకపోవటం ఒకెత్తు అయితే ఇక్కడ మనకి నచ్చే పంచ్ డైలాగ్స్ అక్కడవారికి కిక్ ఇవ్వటం లేదని బాలీవుడ్ విశ్లేషకులు చెప్తున్నారు. డిల్లీ బెల్లి చిత్రానకి కామిడీతో పాటు అమీర్ ఖాన్ ఇమేజ్ బాగా ప్లస్ అయింది. అయితే సినిమాకు శాటిలైట్ రైట్స్ బాగా రావటం, తక్కువ బడ్జెట్ లో సినిమాని రూపొందించటం అమితాబ్ ని ఆనందపరిచిన అంశం.


Click it and Unblock the Notifications











