రాత్రంతా వాళ్లతో పూరీ జగన్ పార్టీ

By Srikanya

పూరీ జగన్నాధ్ తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఓ రేంజిలో సక్సెస్ కావటంతో పూరీ ఆనందానికి అంతే లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ కావటంతో ఆయన దీన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబైలో చిత్రం షూటింగ్ జరిగిన ప్లేస్ లో ఈ పార్టీ జరిగిందని సమాచారం. పార్టీలో రామ్ గోపాల్ వర్మ, రచయితలు బివియస్ రవి, కోన వెంకట్, దర్సకుడు హేమంత్ మధుకర్, నటుడు సుబ్బరాజు ఈ పార్టీలో పాల్గొన్నారు. రాత్రంతా పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పూరీ తనకు ఈ చిత్రం ఐడియాని ఇచ్చిన తన గురువు రామ్ గోపాల్ వర్మ కు ధాంక్స్ చెప్పుకున్నారు. ఇక వర్మ సైతం ఈ చిత్రాన్ని మొదటి నుంచీ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. రీసెట్ గా ఆయన ట్వీట్ చేస్తూ...బిజినెస్ మ్యాన్ చిత్రం ఏస్పరింగ్ గ్యాంగస్టర్ చిత్రం కాదు..ఇన్సైరింగ్ గ్యాంగస్టర్ ఫిల్మ్ అన్నారు. ఇక నేను ముంబైలో బిజినెస్ మ్యాన్ చూసాను. సూపర్ డూపర్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. పెన్ను కనిపెట్టిన తర్వాత ఇంతవరకూ ఇంత బాగుండే డైలాగులు ఎవరూ రాయలేదు.. కంగ్రాట్స్ పూరీ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X