Pushpa 19 Days collections అల్లు అర్జున్ సరికొత్త రికార్డు.. పుష్ప బాక్సాఫీస్ కథ ముగిసినట్టేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం పుష్ప ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. గత మూడు వారాల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించి రికార్డు వసూళ్లను నమోదు చేసింది. కంటెంట్ ఉంటే చాలూ ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించినట్టు కలెక్షన్లు వెల్లడించాయి. గత 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీ నమోదు చేసిన కలెక్షన్లు వివరాలు ఇలా ఉన్నాయి.

పుష్ప 19వ రోజున కలెక్షన్లు
పుష్ప చిత్రం 19వ రోజున తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లను రాబట్టింది. నైజాంలో 7 లక్షలు, సీడెడ్‌లో 4 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 లక్షలు, గుంటూరులో 1 లక్ష, కృష్ణా జిల్లాలో 2 లక్షలు, నెల్లూరులో 1 లక్ష వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో మొత్తంగా 20 లక్షలు షేర్, 32 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు తెలుస్తున్నది.

19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో
ఇక మొత్తంగా 19 రోజల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. నైజాంలో 37.5 కోట్లు, సీడెడ్‌లో 15 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్లు, గుంటూరులో 5.1 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.25 కోట్లు, నెల్లూరులో 3.20 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసి ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరింది. అల్లు అర్జున్ తన కెరీర్‌లో తొలిసారి 300 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషంగా మారింది. గత 19 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, సుమారు 161 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇందులో ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన వసూళ్లే కావడం గమనార్హం. తెలుగులో 84 కోట్ల షేర్, తమిళనాడులో 24 కోట్లకుపైగా గ్రాస్, హిందీ వెర్షన్‌లో 77 కోట్ల గ్రాస్, 31 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

దేశవ్యాప్తంగా పుష్ప బాక్సాఫీస్ రిపోర్టు
పుప్ప చిత్రం గత 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 132 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 84 కోట్లకుపైగా షేర్ సాధిస్తే.. ఉత్తర భారతంలో అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 81 కోట్లకుపైగా గ్రాస్, 30 కోట్లకుపైగా షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఇక కర్ణాటకలో 22 కోట్ల గ్రాస్, 10.5 కోట్ల షేర్, కేరళలో 10.5 కోట్ల గ్రాస్, 5.3 కోట్ల షేర్ వరకు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 270 కోట్ల గ్రాస్, 137 కోట్ల మేర షేర్‌ను కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో పుష్ప హంగామా
ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే.. అమెరికా, కెనడాలోనే భారీ వసూళ్లను సాధించింది. ఈ రెండు దేశాల్లో కలిపి 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యూఏఈలో మొత్తంగా అటు ఇటుగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నేపాల్‌లో 1.5 లక్షల డాలర్లు, యూరప్‌లో 3.5 లక్షల డాలర్లు, ఆస్ట్రేలియాలో 521,584 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం 33 కోట్లు గ్రాస్, 15 కోట్ల మేర షేర్‌ను వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, సుమారు 161 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.
Recommended Video

పుష్ప రాజ్ లాభం ఎంతంటే
పుష్ప చిత్రం రకరకాల ప్రతికూలత మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తూ.. 146 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలో దూకింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 15 కోట్లకుపైగా లాభాన్ని నమోదు చేసింది. ఇటీవల కాలంలో భారీ లాభాలను సొంతం చేసుకొన్న చిత్రాల్లో ఒకటిగా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును 2021లో నెలకొల్పింది.


Click it and Unblock the Notifications











