Pushpa 2 Advance Collections: అమెరికాలో పుష్ప 2 కలెక్షన్ల సంచలనం.. 30 రోజుల ముందే ఎన్ని కోట్లంటే?
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌పై దాడికి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం సిద్దమవుతున్నది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్వకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంచలన విజయం సాధించిన పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పుష్పరాజ్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ప్రమోషనల్ ఈవెంట్స్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ మేరకు భారీ ప్రణాళికను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.

పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. టీమ్ సభ్యులు దేశవ్యాప్తంగా 15 రోజులపాటు 6 నగరాలను చుట్టి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. పుష్ప 2 యూనిట్ మొత్తం పాట్నా, కోచి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిసింది.
అయితే పుష్ప 2 తమ ప్రమోషన్స్ వినూత్న రీతిలోను అలాగే ఎవరూ చేపట్టని విధంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను ఎవరూ ఊహించని విధంగా పాట్నా నగరంలో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ఆ ప్రాంతంలో బిగ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు అన్ని నగరాల్లో ఏర్పాట్లు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.

ఇటీవల కాలంలో బాహుబలి 2 తర్వాత అంతటి క్రేజ్‌ను, అంచనాలు పెంచుకొన్న జాబితాలో పుష్ప 2 చేరింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా రాబట్టేందుకు ముందే అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ల కోసం ఓవర్సీస్‌లో ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా మంచి స్పందన లభిస్తున్నది.
పుష్ప 2 సినిమా నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఈ సినిమా ముందస్తు బుకింగ్‌కు అమెరికాలో భారీగా రెస్పాన్స్ వస్తున్నది. ఈ మూవీ ప్రీమియర్ షో కోసం బుకింగ్ ప్రారంభించగా.. తొలి రోజే 250K డాలర్లు అంటే.. 2.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











