Pushpa 2 Business పుష్ప 2 కళ్ళు చెదిరే భారీ డీల్.. రికార్డు ధరకు టాప్ కంపెనీకి హక్కులు!

విడుదలకు ముందే పుష్ప-2 మేనియా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల అంచనాలకు రెక్కలు కడుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 మూవీ గతంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప సినిమాను మించి ఉంటుందని కన్ఫర్మ్ చేసిన సుక్కు.. ప్రస్తుతం చివరి దశ పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు ఈ సినిమా హక్కుల కోసం మార్కెట్ లో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాట.

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి బీటౌన్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. హిందీ అయితే పుష్ప సినిమా ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కన్ను పుష్ప-2పై పడింది.

Pushpa 2 Audio Rights bagged by T Series for Huge price in the Music Industry

మాస్ జాతర:పుష్ప-2 షూటింగ్ మొదలు పెట్టిన నాటినుంచే ప్రతి సన్నివేశంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలోని సన్నివేశాలు అన్ని వర్గాల ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉండేలా ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప- 2 టీజర్ లాంచ్‌ చేసి మాస్ జాతర షురూ చేశారు.

భారీ డిమాండ్.. పోటీ పడుతున్న సంస్థలు:రిలీజ్‌కి ముందే పుష్ప-2 క్రేజ్ చూసి ఈ సినిమా హక్కుల కోసం పలు దిగ్గజ సంస్థలు పోటీలో దిగాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 ఆడియో రైట్స్ కళ్ళు చెదిరే ధరకు సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఈ హక్కులను టీ-సిరీస్ సంస్థ 20 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు ఇన్ సైడ్ టాక్. పలు సిట్టింగ్స్ అనంతరం ఇప్పటికే ఈ డీల్ క్లోజ్ అయిందని తెలుస్తోంది.

Pushpa 2 Audio Rights bagged by T Series for Huge price in the Music Industry

బన్నీతో రష్మిక మ్యాజిక్:పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అనసూయ, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అల్లు అర్జున్ రూల్ ఇది:పుష్ప సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు పుష్ప‌-2 ది రూల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండనుందట. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X