OTT Business: కల్కి, RRR రికార్డు బ్రేక్ చేసిన పుష్ప 2..ఓటిటి రైట్స్ ఎన్ని వందల కోట్లంటే?
ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర పలు సీక్వెల్ చిత్రాలకి ఉంటున్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. ఇంకా సీక్వెల్ చిత్రాలకి మంచి క్రేజ్ ని తీసుకొచ్చిన చిత్రాల్లో బాహుబలి 2 అనేది ఇండియా లోనే అన్ని సినిమాలకి కొత్త ప్రాణాన్ని పోస్తే అక్కడ నుంచి ఈ అన్ని భాషల్లో భారీ బడ్జెట్ లు పెట్టి సీక్వెల్స్ ని చేసేందుకు దర్శకులు, హీరోలు నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు.
అలా ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సీక్వెల్ సినిమా ఏది అంటే అది KGF 2 అని చెప్పొచ్చు.. కాగా ఈ రెండు సినిమాల తర్వాత పాన్ ఇండియా వైడ్ గా భారీ హైప్ ని సొంతం చేసుకున్న సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా "పుష్ప 2 ది రూల్" అని చెప్పాలి.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ చేసిన ఈ చిత్రం మొదటి పార్ట్ పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్ కి ఊహించని రేంజ్ హైప్ సెట్ అయ్యింది. కాగా ఎప్పుడు నుంచో పుష్ప 2 కి 1000 కోట్ల బిజినెస్ అంటూ పలు రూమర్స్ ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో ఇప్పుడు క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రం ఏకంగా ఓటిటిలో ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఈ భారీ సినిమా కేవలం ఓటిటి హక్కులకే ఏకంగా 270 కోట్ల బిజినెస్ ని చేసిందట. ఇది ఇండియా లోనే అతి పెద్ద రికార్డు అని తెలుస్తుంది. కాగా ఇది గత భారీ బడ్జెట్ చిత్రాలు కల్కి 2898 ఎడి ఇంకా గ్లోబల్ హిట్ చిత్రం RRR కంటే అత్యధికం అట. అన్నట్టు పుష్ప 2 ని 270 కోట్లతో సొంతం చేసుకున్న సినిమా ఏదో కూడా కాదు వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అట..
ఇందులో ఈచిత్రం థియేటర్స్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా భాషలు సహా ఓవర్సీస్ భాషలు కూడా కలిపి కొనేసినట్టుగా తెలుస్తుంది. కాగా దీనికి ముందు కల్కి చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ ఫ్లిక్స్ కలిపి 250 కోట్ల మేర ఇచ్చినట్టుగా టాక్ ఉంది. RRR సినిమా ఏమో 220 కోట్లకి పైగా అన్ని ఓటిటిల బిజినెస్ ని చేసుకుంది.

కానీ పుష్ప 2 ఒక్క ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే 270 కోట్ల ధర పలికింది అంటే పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2 హైప్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ అంచనాలు అన్నిటిని సినిమా అందుకుంటుందో లేదో అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అని చెప్పాలి.
కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాల్సి ఉంది కానీ డిసెంబర్ కి షిఫ్ట్ చేసారు. ఆల్రెడీ వచ్చిన రెండు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. కానీ ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో అల్లు అర్జున్ విషయంలో కొంచెం కాంట్రవర్సియల్ గానే ఉంది. మరి చూడాలి పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో అనేది.


Click it and Unblock the Notifications











