Pushpa 2 : "పుష్ప 2" సంచలనం.. ఇండియాలో మరో ఫస్ట్ ఎవర్ బిగ్ రికార్డు..
భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర సంచలనం రేపిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 ఒకటి. హిందీలో కూడా పలు భారీ సీక్వెల్ చిత్రాలు ఉన్నాయి కానీ మన తెలుగు సహా కన్నడ ఇండస్ట్రీల నుంచి వెళ్లిన చిత్రాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఇపుడు పుష్ప 2 ఈ లిస్ట్‌లో చేరడమే కాదు.. ఇవి సెట్ చేసిన ఎన్నో ఐకానిక్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.
కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన రెండో సీక్వెల్ సినిమా ఇది. రికార్డు వసూళ్లు డే 1 నుంచే మొదలయ్యాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ 4 రాత్రి నుంచే మొదలైన పుష్ప 2 రికార్డుల జాతర ఇప్పటి వరకు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప 2 సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌తోనే ఇపుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప 2 ఎన్నో ఫస్ట్ ఎవర్ రికార్డ్స్ సెట్ చేసింది.

హిందీ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా 650, 700 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేయగా ఇపుడు 800 కోట్ల దిశగా కూడా వెళుతుంది. ఇవే సంచలన రికార్డులు అనుకుంటే ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్న కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డు 17 మిలియన్ కి పైగా టికెట్ బుకింగ్స్ ఎపుడో బ్రేక్ చేసిన పుష్ప 2 ఇపుడు మరో బిగ్గెస్ట్ రికార్డు అందుకుంది అని తెలుస్తుంది.
ఇలా పుష్ప 2 ఏకంగా 19 మిలియన్ టికెట్స్ ని బుక్ చేసుకొని సరికొత్త చరిత్రని సృష్టించింది. కాగా కేజీఎఫ్ 2 రికార్డు బ్రేక్ చెయ్యడమే ఒకెత్తు అయితే ఇపుడు దానికి మించి ఏకంగా 19 మిలియన్‌కి పైగా అంటే ఒక కోటి 90 లక్షలకి పైగా టికెట్స్ ఒక్క బుక్ మై షో ప్లాట్ ఫామ్ నుంచే తెగడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఇతర బుకింగ్స్ ప్లాట్ ఫామ్స్ నుంచి చూసినా ఈ లెక్క ఈజీగా 20 మిలియన్ కి పైగానే ఉండొచ్చు.

ఇండియా వైడ్ గా 2 కోట్ల ఫుట్ ఫాల్స్ ఉన్న సినిమాలు చాలా తక్కువ . ఆ లిస్ట్ లో ఇపుడు పుష్ప 2 చేరడం అంటే ఒక అరుదైన ఘనతని ఈ చిత్రం అందుకున్నట్టే అని చెప్పక తప్పదు. కాగా ఇంకా సంక్రాంతి వరకు టైం ఉంది . మధ్యలో హాలిడేస్, కొన్ని వీకెండ్స్ కూడా ఉన్నాయి. సో.. పుష్ప లెక్క ఇంకా పెరుగుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.


Click it and Unblock the Notifications











