"పుష్ప 2" బాక్సాఫీస్ రూల్ .. 1700 కోట్లతో అల్లు అర్జున్ రేర్ ఫీట్, రేపో మాపో బాహుబలి 2 ఖతమే!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హైయస్ట్ గ్రాసర్ సినిమాలు అంటే హిందీ సినిమాలు మాత్రమే కనిపించేవి. వాటి ముందు అంతా రీజనల్‌గా మాత్రమే మార్కెట్ లు ఉండేవి. హిందీ కూడా రీజనల్ మార్కెట్. కాకపోతే వారికి ఎక్కువ పాపులేషన్ , పాపులారిటీ మూలాన ఎక్కువ రేంజ్ లో వసూళ్లు వచ్చేవి అలా వారు అప్పట్లోనే రూ. 300 కోట్లు- రూ. 400 కోట్లను అలవోకగా క్రాస్ చేసేవారు .
ఆ టైంకి మన తెలుగు సినిమాలు 100 కోట్లు మార్క్ దాటితే అదే పెద్ద సెన్సేషన్. కానీ ఈ బ్యారియర్స్ బ్రేక్ చేస్తూ జక్కన్న తీసుకొచ్చిన సెన్సేషనల్ పాన్ ఇండియా చిత్రం "బాహుబలి" దెబ్బకి అన్ని లెక్కలు, బాక్సాఫీస్ షేప్‌లు మారిపోయాయి. ఇక బాహుబలి 1 ఒక దెబ్బ అయితే బాహుబలి 2 సెట్ చేసిన ఇండియా వైడ్ రికార్డ్స్ కానీ వరల్డ్ వైడ్ రికార్డులు కానీ ఊహించని లెవెల్లోకి వెళ్లిపోయాయి.

దీంతో ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసింగ్ సినిమా. చైనా రిలీజ్ కాకుండా చూస్తే 2017 నుంచి ఇప్పటి వరకు బాహుబలి 2 మాత్రమే 1800 కోట్లకి పైగా గ్రాస్ చేసింది. కాగా ఈ రికార్డులు చాలా సినిమాలు బద్దలు కొడతాయి అనుకున్నారు. ఆ మధ్య వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కొట్టేస్తుంది అనుకున్నారు కానీ అలాంటి ఎన్నో సినిమాలు క్రాస్ చేయలేని రికార్డు దగ్గరికి ఇపుడు ఒక ఊరమాస్ గాడు పరుగులు పెడుతున్నాడు.
మరి అతనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన నటించిన "పుష్ప 2" సినిమాకి కూడా భారీ హైప్ ఉంది. కానీ బాహుబలి 2 రికార్డులు టచ్ చేయడం అనేది చాలా మంది కష్టమే అనుకున్నారు. కానీ హిందీ మార్కెట్ లో పుష్ప 2కి బాహుబలి 2కి మించిన వసూళ్లు అది కూడా డబుల్ మార్జిన్ తో కొట్టడం అనేది ఒక రేర్ ఫీట్‌గా మారిపోయింది. దీనితో బాహుబలి 2 దగ్గరకి ఇపుడు పుష్ప 2 చేరుకుంది.
లేటెస్ట్ గా మేకర్స్ ఇచ్చిన లెక్కలే చూస్తే కేవలం 21 రోజుల్లోనే 1705 కోట్ల గ్రాస్‌ని అందుకొని ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 1700 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాగా పుష్ప 2 రేర్ ఫీట్ సాధించింది. ఈ చిత్రానికి ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాలిడేస్, వీకెండ్ వసూళ్లు బాగా ప్లస్ అవుతున్నాయి. అలాగే హిందీ మార్కెట్ లో కూడా గట్టిగానే వస్తున్నాయి. దీనితో కేవలం హిందీ వెర్షన్ లోనే ఇంకో 100 కోట్లు ఈజీగా వస్తాయనే టాక్ వినిపిస్తుంది.
దీనితో పుష్ప 2.. అస్సలు అసాధ్యం అనుకున్న బాహుబలి 2 రికార్డులని బద్దలు కొట్టి సుసాధ్యమే చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ పేరిట ఒక సరికొత్త చరిత్ర ఇండియన్ సినిమా దగ్గర లిఖించబడేలా ఉందని చెప్పి తీరాలి. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్, కొత్త ఏడాది సెలవు, అలాగే సంక్రాంతి వరకు కూడా పుష్ప 2కి ఎలాంటి అడ్డు లేదు. అప్పటి వరకు లాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి.. డెఫినెట్‌గా బాహుబలి 2ని బ్రేక్ చేసేస్తుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











