Pushpa 2 Japan Box Office: షాకింగ్‌గా పుష్ప 2 జపాన్ కలెక్షన్లు..అల్లు అర్జున్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప 2. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లను రాబట్టింది. పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్‌ను పుష్ప రాజ్ కలెక్షన్లతో శాసించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో జనవరి 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా జపాన్‌లో నమోదు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

Pushpa 2 Day 1 Box Office Collections in Japan

జపాన్‌లోని తన అభిమానులను ఆకట్టుకొనేందుకు పుష్ప 2 సినిమాను భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు స్వయంగా అల్లు అర్జున్ జపాన్‌లో ప్రమోషన్స్ భారీగానే చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యామిలీతో కలిసి ఆ దేశంలో పర్యటించడం తెలిసిందే.

జపాన్ దేశంలో ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్రదర్శించగా భారీ స్పందన కనిపించింది. తొలి రోజ ఈ సినిమాకు సంబంధించి 750 షోలు ప్రదర్శించారు. ఈ సినిమాను సుమారుగా 4000 మంది తొలి రోజున వీక్షించారు. ఈ దేశంలో భారతీయ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం ఇటీవల కాలంలో అరుదుగా కనిపించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పుష్ప 2 సినిమా ప్రీమియర్లకు క్రేజీగా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ లభించడం కనిపించింది. ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం 15 లక్షల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజు ఈ సినిమా 7 మిలియన్ల యెన్ (45 వేల అమెరికా డాలర్లు) అంటే భారతీయ కరెన్సీలో 40 లక్షలు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్లు, తొలి రోజు వసూళ్లు కలిపి మొత్తంగా 55 లక్షల రూపాయలు వసూలు చేసింది అని బాక్సాఫీస్ ట్రాకర్ జెరిన్ జార్జ్ కుట్టి తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

పుష్ప 2 మూవీకి సంబంధించి తాను వెల్లడించిన కలెక్షన్లు వివరాలు విషయంలో అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు. తనకు లభించిన తాజా సమాచారం ఆధారంగా తెలియజేశాను. ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసిన వారు త్వరలోనే అధికారికంగా కలెక్షన్ల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది అని జెరిన్ జార్జికుట్టి తన పోస్టులో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X