Pushpa 2 Day 2 Japan Collections: షాకింగ్‌గా పుష్ప 2 కలెక్షన్లు.. జపాన్‌లో అల్లు అర్జున్ మూవీ పరిస్థితి ఏమిటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంచలన చిత్రం పుష్ప 2 ఇండియాలోనే కాకుండా విదేశాల్లో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం 2024-25 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. అలాంటి చిత్రాన్ని జపాన్ భాషలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా క్రియేట్ చేసిన వైబ్‌ను జపాన్ ప్రేక్షకుల్లో కలిగించలేకపోయారనే విషయం స్టైలిష్ స్టార్ అభిమానులకు విస్మయాన్ని కలిగిస్తున్నది. ఈ సినిమా జపాన్‌ బాక్పాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కొనసాగించడం ట్రేడ్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జపాన్‌లో పుష్ప 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా పుష్ప 2 నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లను రాబట్టింది. పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్‌ను పుష్ప రాజ్ కలెక్షన్లతో శాసించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో జనవరి 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Pushpa 2 Day 2 Box Office Collections in Japan

పుష్ప 2 చిత్రం విడుదలకు ముందు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతోపాటు, అలాగే హీరోయిన్ రష్మిక మందన్న జపాన్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో సినిమాను ప్రమోట్ చేశారు. అక్కడ ప్రేక్షకులు, ఐకాన్ స్టార్ అభిమానుల నుంచి ఫీల్‌గుడ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా భారీ వసూళ్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు వేశారు. అయితే విడుదల తర్వాత జపాన్ ప్రేక్షకులు మాత్రం అంతగా స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

బాక్సాఫీస్ విశ్లేషకుడు జెరీన్ జార్జికుట్టీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పుష్ప 2 జపాన్ వెర్షన్ కలెక్షన్లను షేర్ చేశారు. ఈ సినిమా గత మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లను మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన షేర్ చేసిన నంబర్లు మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్థాయికి లేకపోవడం షాకింగ్‌గా మారింది.

పుష్ప 2 సినిమా జపాన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ షోకు కేవలం 190 మంది మాత్రమే రావడం, తద్వారా 350K యెన్స్ (భారతీయ కరెన్సీలో 2 లక్షల రూపాయలు) వసూలు అయ్యాయి. తొలి రోజు 1098 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 1.63 మిలియన్ యెన్‌లు (9.5 లక్షల రూపాయలు) రాబట్టింది. ఇక రెండో రోజు 847 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 1.26 మిలియన్ యెన్స్ (7.21 లక్షల రూపాయలు) కలెక్ట్ అయ్యాయి అని జెరీన్ జార్జ్ కుట్టి తెలిపారు.

గత 2 రోజుల్లో పుష్ప 2 చిత్రం కేవలం 3.24 మిలియన్ యెన్స్ రాబట్టింది. డాలర్లలో లెక్కిస్తే.. 20 వేల డాలర్లు అంటే సుమారుగా 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇటీవల విడుదలైన భారతీయ సినిమాలతో పోల్చుకొంటే చాలా పేలవంగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకొని భారీ వసూళ్లు సాధిస్తుందనే ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X