"పుష్ప 2" బాక్సాఫీస్ మోత .. జెట్ స్పీడ్‌తో అల్లు అర్జున్, రేపో మాపో కల్కీ ఖతం

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో ఓ రేంజ్‌లో వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా అది బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం "పుష్ప 2" అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్‌తో చేసిన నాలుగో చిత్రం ఇది. కాగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. పైగా పుష్ప పార్ట్ 1 కూడా ఓ రేంజ్ లో హిట్ కాగా పార్ట్ 2పై ఊహించని అంచనాలు నెలకొనడంతో ఈసారి రికార్డుల మోత వేరే లెవెల్లో ఉంటుంది అని ట్రేడ్ పండితులు ముందే చెప్పారు.

కాగా అందుకు తగ్గట్టుగానే పుష్ప 2కి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నమోదు అయ్యాయి. ఇండియన్ సినిమా చరిత్రలో 223 కోట్ల గ్రాస్‌తో RRR సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటే దానిని భారీ మార్జిన్ తో పుష్ప 2 కొట్టేసింది. ఇదే హైయెస్ట్ అనుకుంటే ఈ చిత్రం ఇపుడు రికార్డు వసూళ్లు కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపిస్తుంది.

pushpa 2 eyes on indias highest grossing film by broke kalki 2898 ad

కేవలం మొదటి వారాంతంలోనే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప 2 ఇపుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ రికార్డు కొట్టేలా ఉందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాదిలో పాన్ ఇండియా లెవెల్లో చాలా సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. అలా ఈ 2024లో భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర హైయెస్ట్ గ్రాస్ అందుకున్న చిత్రాల్లో 1100 కోట్లకి పైగా గ్రాస్ తో రెబల్ స్టార్ ప్రభాస్ "కల్కి 2898 ఎడి"తో ఆల్ టైం టాప్ 1 ప్లేస్ లో ఉంది.

కానీ ఇపుడు దీనిని పుష్ప 2 ఈజీగా బ్రేక్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా కల్కి 2898 ఎడి లాంగ్ రన్ లో 1100 కోట్లు రాబట్టింది. కానీ పుష్ప 2 కేవలం 5 రోజుల్లోనే 900 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. డిసెంబర్ 5న విడుదల అయ్యిన ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం కూడా ఉంది. సో ఈ ఏడాది ముగిసే లోపు చాలా రికార్డులు బ్రేక్ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

pushpa 2 eyes on indias highest grossing film by broke kalki 2898 ad

ఇంకా ఈ 1100 కోట్ల పేరిట ఉన్న హైయెస్ట్ రికార్డు కూడా ఇపుడు పుష్ప 2 పేరు మీదకే వచ్చేస్తుంది. ఇలా 2024 ఎండింగ్‌తో మాత్రం పుష్ప రాజ్ తన పేరు మీదే హైయెస్ట్ రికార్డులు నమోదు చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇలా 2024 బిగ్గెస్ట్ గ్రాసర్ గా పుష్ప రాజ్ సెన్సేషనల్ రికార్డు సెట్ చేస్తున్నాడు. ఇక ఈ భారీ సినిమాలో రష్మిక మందన్నా, శ్రీలీల రొమాన్స్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X