15 రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్టుగా పుష్ప 2 .. డబుల్ ప్రాఫిట్స్‌కు దగ్గరిగా?.. ఎన్ని కోట్లంటే?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర రికార్డు వసూళ్లు అందుకొని అదరగొట్టిన పలు సెన్సేషనల్ చిత్రాల్లో లేటెస్ట్ గా మన తెలుగు సినిమాలు కూడా ఏ రేంజ్ ప్రభావం చూపిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే ఈసారి కూడా తెలుగు నుంచి వెళ్లిన ఓ సినిమా ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తుంది. ఇలా లేటెస్ట్ గా వచ్చిన ఆ సినిమానే "పుష్ప 2".
స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన ఆల్ టైం హిట్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి ఇండియన్ సినిమా దగ్గర కొత్త లెక్కలు నమోదు చేసింది. కాగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలుగు కంటే హిందీ ఆడియెన్స్ లో ఈ సినిమాకి క్రేజ్ ఎక్కువయ్యిపోయింది.

ఇలా హిందీలోనే ఏ సినిమాకి జరగని విధంగా 200 కోట్లకి పైగా బిజినెస్ జరిగితే ఏకంగా దానికి డబుల్ ప్రాఫిట్స్ ని ఈ సినిమా అందుకునేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీలో ఇప్పుడు వరకు చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ లు ఉన్నాయి. ఒక్క గత ఏడాదిలోనే పఠాన్, గదర్ 2 అలాగే జవాన్ అనే మూడు సినిమాలు ఒకదాన్ని ఒకటి బ్రేక్ చేసి ఇండియా వైడ్ గా హిందీ వెర్షన్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచాయి.
కాగా ఈ ఏడాదిలో మాత్రం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా సంచలనం సెట్ చేసింది. అదే "స్త్రీ 2". బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర సెట్ చేసిన నంబర్స్ చూసి ట్రేడ్ పండితులు షాకయ్యారు. షారుఖ్ ఖాన్ లాంటి హీరో సినిమా వసూళ్లనే ఈ చిత్రం భారీ మార్జిన్ తో కొట్టింది . అలాంటి స్త్రీ 2 సినిమాని కూడా ఇపుడు మన తెలుగు సినిమా హిందీ వెర్షన్ లో కొట్టింది అనేది మరో ఎత్తు అని చెప్పాలి.

కాగా హిందీలో స్త్రీ 2 లైఫ్ టైం వసూళ్లు 620 కోట్ల నెట్ ప్లస్ అందుకుంది. ఇది సుమారు నెల, నెలన్నరకి పైగా జరిగిన లాంగ్ రన్ లో ఆ చిత్రానికి వస్తే ఇపుడు దీనిని పుష్ప 2 కేవలం 15 రోజుల్లోనే బ్రేక్ చేసి హిందీ నాట చరిత్ర సృష్టించింది. మామూలుగా మన తెలుగు సినిమా దగ్గర ఇండస్ట్రీ హిట్స్ అని మాటలు వింటాం..
కానీ పుష్ప 2 కొట్టిన దెబ్బకి బాలీవుడ్ షేక్ అయ్యి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అదరగొట్టింది. దీనితో ఈ చిత్రం హిందీ సినిమా దగ్గర కనీ వినీ ఎరుగని ఫీట్ ని సెట్ చేసింది అని చెప్పాల్సిందే. కాగా ఇది హిందీ సినిమాలో కేవలం సగం రన్ మాత్రమే అని చెప్పొచ్చు. ఫ్యూచర్ లో పుష్ప2 రూ. 700 నుంచి 800 కోట్లకి టచ్ అయ్యినా ఎలాంటి ఆశ్చర్యం లేదని హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











