Pushpa 2 డిమాండ్ మామూలుగా లేదు.. ఆ రాష్ట్రంలో ఏకంగా 30 కోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తప్పకుండా పార్ట్ 1 కంటే రెండవ భాగం రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఫ్యాన్స్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తోంది. ఇక నిర్మాతలు మాత్రం బిజినెస్ విషయంలో ఈసారి పెద్ద టార్గెట్స్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేయాలని అనుకున్నట్లు ఆ మధ్య టాక్ అయితే వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సుకుమార్ పర్ఫెక్ట్ ప్లానింగ్:ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తాజాగా రంపచోడవరం ఫారెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది వేసవిలో పుష్ప ది రూల్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సుకుమార్ ప్లానింగ్ వేసుకున్నారు.

భారీగా ఆఫర్ చేస్తూ:అయితే ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ మూవీపై అమాంతం అంచనాలు పెంచేశాయి. దీంతో అప్పుడే సినిమాని ఆయా భాషలలో కొనడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకొస్తున్నారు. భారీగా ఆఫర్ చేస్తూ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. అయితే పుష్ప 2 మూవీపై మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా హెవీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

హై రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్:కచ్చితంగా సినిమాపై 700 కోట్ల బిజినెస్ ని మైత్రీ నిర్మాతలు ఆశిస్తున్నారంట. ఈ నేపథ్యంలో డిస్టిబ్యూటర్స్ నుంచి వస్తోన్న ఆఫర్స్ కంటే ఎక్కువగా వారు ఆశిస్తున్నారు. కన్నడ రైట్స్ కోసం ఓ ఇద్దరు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కన్నడ రిలీజ్ రైట్స్ కోసం 20 కోట్ల వరకు మైత్రీ వారికి ఆఫర్ చేసారంట. అయితే వారు మాత్రం 30 కోట్లకి తగ్గేదిలే అని ఫిక్స్ అయినట్లు ప్రచారం నడుస్తోంది.

ఆ ఒక్క రాష్ట్రంలో 30 కోట్ల డిమాండ్:కన్నడ ఇండస్ట్రీలో హైయెస్ట్ బిజినెస్ డీల్ బాహుబలి 2పైన జరిగింది. 38 కోట్లకి ఈ మూవీ కన్నడ రైట్స్ సొల్ద్ అయ్యాయి. అంత వరకు వెళ్లకపోయిన 30 కోట్ల వరకు అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎక్స్ పక్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ముందు ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు మార్కెట్ లోకి రీచ్ అవుతుంది అనుకుంటే అంత మొత్తం పెట్టొచ్చని సదరు నిర్మాతలు సైలెంట్ అయ్యారంట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి పుష్ప బిజినెస్ డీల్స్ ఏ రేంజ్ జరుగుతాయో చూడటానికి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











