Pushpa 2: భారీ ధరకు అమ్ముడైనా ఆడియో రైట్స్.. దేశవ్యాప్తంగా రికార్డు బ్లాస్ట్ అయ్యే డీల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తన మార్కెట్ స్థాయిని ఒక్కసారిగా పెంచేసుకున్నాడు. ఇప్పుడు అతనికి నేషనల్ వైడ్ గా మంచి డిమాండ్ అయితే ఉంది. పుష్ప సెకండ్ పార్ట్ తప్పకుండా మార్కెట్లో మంచి బిజినెస్ అయితే క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ కోసం కూడా బడా సంస్థలు చాలాకాలంగా పోటీ పడుతున్నాయి. అయితే ఇటీవల ఒక సంస్థకు అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ అమ్మేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అంచనాలు మరింత పెరిగాయి: అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో బలమైన కంటెంట్ తో పాటు మంచి క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తన డాన్స్ తో కూడా ఆకట్టుకుంటూ సినిమాకు మరింత బూస్ట్ అయితే ఇస్తాడు. ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ పై అయితే అంచనాలు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తప్పకుండా ఫాన్స్ అంచనాలను అందుకునే విధంగా సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు.

బడ్జెట్ పెరిగే అవకాశం : ఇప్పటికే కొంత షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు త్వరలోనే మరో కీలకమైన షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి ఆ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 300 కోట్లు ఖర్చు అయినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని కథనాలు వెలువడుతున్నాయి.
సినిమా బిజినెస్.. బన్నీ న్యూ టార్గెట్? : అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా నిర్మాతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సినిమా బిజినెస్ అయితే తప్పకుండా 1000 కోట్లు చేరుకోవాలి అని అందుకు తగ్గ ప్రమోషన్స్ అప్డేట్స్ కూడా ఇవ్వాలి అని నిర్మాతలతో తరచుగా చర్చలు జరుపుతున్నారు. సుకుమార్ కూడా అదే టార్గెట్ గా సినిమా కంటెంట్ హైలెట్ అయ్యే విధంగా అప్డేట్స్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నాడు.

రికార్డు బ్రేక్ అయ్యేలా పుష్ప రాజ్ ప్లాన్: ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు దాదాపు 700 కోట్ల వరకు చేరువయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి హిందీ మార్కెట్లో కూడా పుష్ప సెకండ్ పార్ట్ కు మంచి డిమాండ్ అయితే పెరిగే అవకాశం ఉంది. తప్పకుండా గత సినిమాల రికార్డులను కూడా పుష్ప రాజ్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

భారీ ధరకు అమ్ముడైన ఆడియో రైట్స్: అయితే పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ కోసం కూడా బడా సంస్థలు చాలాకాలంగా పోటీ పడుతున్నాయి. ఫైనల్ గా టీ సీరీస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు కొన్ని ట్యూన్స్ కూడా ఫైనల్ చేసినట్లు టాక్. అయితే ఈ సినిమా ఆడియో రైట్స్ డీల్ దాదాపు 65 కోట్లకు ఫైనల్ అయినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టి సిరీస్ కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ..:గతంలో ఎప్పుడు లేని విధంగా పుష్ప సెకండ్ పార్ట్ ఆడియో రైట్స్ మార్కెట్లో అయితే సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నాయి. ఇంతకుముందు RRR సినిమా అత్యధికంగా ఆడియో రైట్స్ ద్వారా 25 కోట్లు దక్కించుకుంది. ఇక ప్రభాస్ సాహో సినిమా ఆడియో రైట్స్ ద్వారా 22 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 ఆడియో రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ పుష్ప 2, 65 కోట్లకు చేరుకోవడం విశేషం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











