నార్త్ ఇండియాలో "పుష్ప 2" విధ్వంసం.. 600 కోట్ల పైగా ఫినిష్, అసలు కథ ముందుంది

ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ చిత్రం పుష్ప 2 అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఒక అవైటెడ్ సీక్వెల్ గా వచ్చింది. కాగా తెలుగులో సహా హిందీ మార్కెట్‌లో పుష్ప 2‌కి మంచి డిమాండ్ ముందు నుంచి నెలకొంది.

అలాగే పార్ట్ 1 కి రీచ్ ఊహించని లెవెల్లో రావడం తెలుగు సహా హిందీ సినిమాలో జెనరల్ ఆడియెన్స్‌కి మాస్ ఆడియెన్స్‌కి పుష్ప అనే పాత్ర బాగా రీచ్ కావడం జరిగింది. ఇంతే కాకుండా పలువురు స్టార్ క్రికెటర్స్ కూడా పుష్ప మ్యానరిజంలని ఫాలో అవ్వడంతో పుష్ప మేనియా అనేది ఓ రేంజ్‌లోకి వెళ్ళిపోయింది. కాగా ఇలా పార్ట్ 2 కి అంతకు మించిన హైప్ స్టార్ట్ కాగా ఇపుడు ఫైనల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లను రాబడుతుంది.

pushpa 2 storm at hindi boxoffice will it set new benchmarks

ఇప్పటి వరకు దాదాపు 1500 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రంలో మేజర్ కంట్రిబ్యూషన్ ఒక్క హిందీ వెర్షన్ నుంచే ఉంది అంటే నమ్మడం కష్టం. కానీ ఇదే నిజం. ఒక తెలుగు సినిమా 1000 కోట్ల మార్క్ ని దాటాలి అంటే అందులో హిందీ వసూళ్లు చాలా కీలకం. అందుకే మనవాళ్లు హిందీ మార్కెట్‌ని ప్రత్యేకంగా తీసుకున్నారు. దీనితో పుష్ప 2 దెబ్బకి హిందీ హీరోల రికార్డులు కూడా బాలీవుడ్‌లో కదిలిపోయాయి.

పుష్ప 2 ఇండియాలో కేవలం హిందీ వెర్షన్ లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచి సంచలనం సెట్ చేసింది. హిందీ మార్కెట్‌లో సుమారు ఏడేళ్లుగా బాహుబలి 2 రికార్డు పదిలంగా ఉంటే దానిని కేవలం 10 రోజుల్లోనే బ్రేక్ చేసేసింది పుష్ప 2. దీని తర్వాత హిందీలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ 2పై పుష్ప కన్నేయగా దానిని కూడా ఈ రెండు రోజుల్లో దాటేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుష్ప 2 ఈ 13 రోజుల్లోనే రూ. 601 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకొని హిందీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. కాగా ఇపుడు అసలు డౌట్ ఏంటంటే హిందీలో ఆల్ టైం రికార్డు కోసం కాదు దానిని ఎలాగో పుష్ప 2 కేవలం ఈ రెండు రోజుల్లో క్రాస్ చేసేస్తుంది . అసలు పుష్ప వసూళ్ల మార్క్ హిందీలో ఎక్కడ ఆగుతుంది అని. ప్రస్తుతం అల్లు అర్జున్‌ జోరు చూస్తుంటే ఈ వారం పూర్తయ్యేసరికి రూ.700 కోట్ల నెట్‌కి చేరుకుంటుంది.

కానీ ఇది లాంగ్ రన్ లో రూ.800 కోట్లకి వెళుతుందా ? లేదా ? అనేది ప్రశ్నగా మారింది. హిందీలో లాంగ్ రన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇపుడు ఉన్న స్త్రీ 2, జవాన్, బాహుబలి 2 లాంటి సినిమాలు సుమారు నెలకి పైగా రన్ అయితే తప్ప ఈ నంబర్స్ నమోదు కాలేదు. కానీ అలాంటిది వాటిని పుష్ప 2 సగం రోజుల్లోనే దాటేసింది. సో లాంగ్ రన్‌లో పుష్ప 2 సెట్ చేసే బిగ్గెస్ట్ ఫిగర్స్ పట్ల బాలీవుడ్ లో చర్చ మొదలైంది. మరి ఈ రికార్డులను ఏ సినిమా అయినా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది ఉత్కంఠగా నిలిచింది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X