Pushpa 2: పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్? RRR, బహుబలి రికార్డులను బ్రేక్ చేసేనా?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పాన్ ఇండియా సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ ప్రమోషన్ బాధ్యతల హీరో అల్లు అర్జున్ తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? RRR, ప్రభాస్ బాహుబలి సినిమాల బ్రేక్ ఇవెన్ కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే.. ఎంత రాబట్టాలనేది ఆసక్తిగా మారింది.
మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఫహద్ పోజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించారు.

పుష్ప 2 మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ అండ్ హీరో అల్లు అర్జున్ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇలా నార్త్.. సౌత్.. అనే తేడా లేకుండా ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించిన భారీ మొత్తంలో బన్నీఫ్యాన్స్ తరలివస్తున్నారు. ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్ పెట్టిన లెక్కలేనంత అల్లు అర్జున్ ఆర్మీ వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేస్తుంది.
ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మూవీ మేకర్స్ ప్రతిపాదనలను సానుకూలంగానే స్పందిస్తూ టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో పుష్ప 2 ఫ్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలాగే పుష్ప 2 సినిమాకి పోటీగా ఏ భారీ బడ్జెట్ మూవీ లేకపోవడంతో దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇకపోతే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రాలో 90 కోట్లు, సీడెడ్ లో 30 కోట్లు, నైజాంలో 100 కోట్ల మేరా డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే.. 250 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంటుంది. పైగా 18% జీఎస్టీ, 20% కమిషన్ పోగా థియేటర్ రేట్లు ఖర్చులు, ఈ లెక్కన చూసుకుంటే 450 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాలలో గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా హైయెస్ట్ రూ. 415 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 సినిమా ఏకంగా 330 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా.. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలో కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించాలో అర్థమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప గాడి రూలింగ్ ఏ విధంగా ఉంటుందో , ఈ సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











