Pushpa 2 Day 1 Collections : బాక్సాఫీస్ రూలర్ .. పుష్ప 2‌కి రికార్డు ఓపెన్సింగ్స్, ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు జంటగా నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల తర్వాత పుష్పరాజ్ ఎలాంటి మేజిక్ చేశాడు? తన నేర సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్‌ రేంజ్‌కు ఎలా చేర్చాడు? ఎర్ర చందనం సిండికేట్‌తో పాటు రాజకీయాలను ఎలా శాసించాడు? భన్వర్ సింగ్ షెకావత్‌పై ఎలా పై చేయి సాధించాడు? ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పుష్ప 2 తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందోనని ఆన్‌లైన్‌లో డిస్కషన్ నడుస్తోంది.

పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రమోషన్ కార్యక్రమాలు దీనికి అదనం. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ పుష్ప 2పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.

Pushpa 2 The Rule Box Office Day 1 Expected collections report

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డు స్థాయిలో రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ. 425 కోట్ల వ్యాపారం చేసింది పుష్ప 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ రూ. 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. అలాగే శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, రూ. 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసిందట.

దీంతో రూ. 1200 కోట్ల గ్రాస్ , రూ. 620 కోట్ల షేర్ లక్ష్యంగా పుష్ప 2 బరిలో దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్మురేపిన పుష్ప 2 .. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ వివరాలు చూస్తే:

Pushpa 2 The Rule Box Office Day 1 Expected collections report

ఇప్పటికే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా తొలి రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు, హిందీలో రూ. 60 కోట్లు, తమిళనాడు , కేరళ, కర్ణాటకలలో రూ. 35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్ల చొప్పున గ్రాస్ వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి పుష్పగాడు ఎలాంటి మేజిక్ చేస్తాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X