Pushpa 2 Day 10 collection : అల్లు అర్జున్ 1200 కోట్ల చరిత్ర.. బాహుబలికి అడుగు దూరంలో, 10వ రోజు ఎంత అంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి.. తన కెరీర్‌లో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాడు అల్లు అర్జున్. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ కలెక్షన్ల రికార్డును అధిగమించిన పుష్ప 2.. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలకు తోడు అల్లు అర్జున్ లుక్, గెటప్‌‌తో పుష్ప 2‌కి దేశవ్యాప్తంగా భారీ హైప్ వచ్చింది.

Pushpa 2 The Rule Box Office Day 10 collections report

ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్‌లో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది. దీంతో పుష్ప 2కు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్‌‌‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు. భారతీయ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా దాదాపు 11000 స్క్రీన్‌లలో డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప 2 ది రూల్. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడమే కాదు.. హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 10లోకి వచ్చేసింది.

ఇక 10వ రోజు వీకెండ్ కావడంతో పుష్ప 2 ది రూల్‌కు బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా సాలీడ్ హోల్డ్ సాధించింది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 కోట్లు, హిందీలో రూ. 48 కోట్లు, తమిళనాడులో రూ.3 కోట్లు, కర్ణాటక, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి రూ. 3 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 7 కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 65 కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది.

Pushpa 2 The Rule Box Office Day 10 collections report

మిగిలిన ఇండస్ట్రీల సంగతి ఏమో కానీ హిందీలో మాత్రం పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఓ హస్టారిక్ రికార్డును బద్ధలు కొట్టేందుకు పుష్ప 2 సిద్ధమైంది. అదేంటంటే. ఏడేళ్ల క్రితం హిందీలో బాహుబలి 2 రూ.511 కోట్ల నెట్ కలెక్షన్స్ సృష్టించగా.. ఇప్పుడు పుష్ప రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆదివారం మార్నింగ్ షోకే ఈ రికార్డును పుష్ప 2 ది రూల్ అధిగమించనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం కలెక్షన్స్‌ మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: pushpa pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X