Pushpa 2 Day 13 collection : బాలీవుడ్ బాద్ షాకి ముచ్చెమటలు, జవాన్‌ వెనక్కి .. 1400 కోట్ల దిశగా పుష్ప2

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడేళ్ల క్రితం వచ్చి దేశాన్ని ఊపేసిన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో టాలీవుడ్‌ను కొట్టేవాళ్లు లేరని పుష్ప 2 మరోసారి రుజువు చేసింది. విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త బెంచ్ మార్క్‌ సెట్ చేశాడు అల్లు అర్జున్.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలతో పాటు జాతరలో లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ లుక్ బయటికి రావడంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pushpa 2 The Rule Box Office Day 13 collections report

ఈ హైప్ కారణంగా పుష్ప 2 ది రూల్‌ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. తద్వారా రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పుష్ప 2 ముందు ఉంచారు ట్రేడ్ పండితులు. భారీ అంచనాలతో ఏకంగా 11 వేల థియేటర్లతో బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేసింది.

సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏమాత్రం తగ్గలేదు. బన్నీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ డ్రాప్ అవుతున్నా హిందీ జనాలు మాత్రం పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ. 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది అంటే ఈ సినిమా రేంజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు 12 రోజులుగా రోజుకు రూ. 20 కోట్లు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ బడా స్టార్స్ నటించిన సినిమాలను సైతం క్రాస్ చేస్తూ దూసుకెళ్తున్నాడు పుష్పరాజ్.

Pushpa 2 The Rule Box Office Day 13 collections report

ఈ క్రమంలో గతేడాది హిందీ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ టోటల్ నెట్ కలెక్షన్స్‌ను పుష్ప 2 బద్ధలు కొట్టింది. జవాన్ టోటల్ రన్‌లో హిందీ వర్షెన్‌లో రూ.583 కోట్ల నెట్ సాధించగా.. దానిని 13వ రోజు మార్నింగ్ కలెక్షన్స్‌తోనే పుష్ప 2 అధిగమించాడు. హిందీ మార్కెట్‌లో హయ్యెస్ట్ నెట్ కలెక్షన్స్ సాధించిన రికార్డు శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ2 పేరిట ఉంది. అయితే మూడో వారంలోనే ఈ రికార్డును అల్లు అర్జున్ అధిమిస్తాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక 13వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగులో రూ.5.11 కోట్లు, హిందీలో 19.27 కోట్లు, తమిళ్‌లో రూ.1.46 కోట్లు, కేరళ, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలలో రూ.84 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.33 కోట్లు చొప్పున మొత్తంగా రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X