Pushpa 2 Day 15 collection : పడిపోయిన పుష్ప 2 వసూళ్లు .. తెలుగులో దారుణంగా, ఎన్ని కోట్లంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్ల వర్షం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ.1400 కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ బాహుబలిని కొట్టాలని చూస్తోంది. మరి రాజమౌళి రికార్డును అల్లు అర్జున్ క్రాస్ చేస్తాడా? 15వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 15 collections report

టీజర్, ట్రైలర్లు, నటీనటుల గెటప్స్‌కు తోడు పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో‌ ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు విపరీతమైన గిరాకీ నెలకొంది. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. తద్వారా రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

ఏకంగా 11 వేల థియేటర్లతో బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్ల వసూళ్లు రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. పుష్ప 2 కంటే ముందు దంగల్, బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి. లాంగ్ రన్‌లో బాహుబలి కలెక్షన్ల రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Pushpa 2 The Rule Box Office Day 15 collections report

ఇక రూ. 1400 మార్క్‌ను అత్యంత వేగంగా అందుకుని పుష్ప 2 మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బాహుబలి 2 పేరిట ఉండేది. రాజమౌళి చిత్రం 18వ రోజు నాటికి రూ. 1400 కోట్లు వసూళ్లు చేయగా.. పుష్ప 2 కేవలం 14 రోజుల్లోనే ఈ కలెక్షన్లు అందుకుంది. అంటే సరాసరి రోజుకు రూ.100 కోట్లు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది పుష్ఫ 2. ఇక 15వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. తెలుగు రాష్ట్రాల్లో రూ.3.12 కోట్లు, హిందీలో రూ. 15.23 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ. 73 లక్షల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇలా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1426 కోట్ల కలెక్షన్లను పుష్ప 2 కొల్లగొట్టి రూ.2000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X