Pushpa 2 Day 16 collection : టఫ్ ఫైట్‌లోనూ పుష్పనే కింగ్.. కుమ్మేస్తోన్న అల్లు అర్జున్, ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 ప్రభంజనం దాటికి బాలీవుడ్ బడా సూపర్‌స్టార్ల రికార్డులు గల్లంతు అవుతున్నాయి. ఇప్పటికే పఠాన్ పనిపట్టిన అల్లు అర్జున్.. నెక్ట్స్ స్త్రీ 2 ఓవరాల్‌గా హిందీలో సాధించిన రికార్డులను బద్ధలుకొట్టే దిశగా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో 16వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే ..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు పుష్ప 1 క్రేజ్ కారణంగా పుష్ప 2 ది రూల్‌పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. దీని కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు .
అంచనాలను నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాడు అల్లు అర్జున్. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. ఈ విధ్వంసంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. పుష్ప 2 కంటే ముందు దంగల్, బాహుబలి 2 చిత్రాలు నిలిచాయి. అల్లు అర్జున్ జోరు చూస్తుంటే లాంగ్ రన్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక మూడో వారంలో అల్లు అర్జున్ జోరుకి కాస్త బ్రేక్ పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. హాలీవుడ్ మూవీ ముఫాసా ది లైన్ కింగ్, తమిళ చిత్రం విడుదల, తెలుగులో బచ్చలమల్లి సినిమాలు శుక్రవారం భారతదేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యాయి. దీంతో కొన్ని చోట్ల వసూళ్లు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ ఎలాంటి పరిస్ధితులు ఉన్నా సరే.. హిందీలో మాత్రం పుష్ప2కి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 16వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.2.86 కోట్లు, హిందీలో రూ.12 కోట్లు, తమిళ్, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. కోటి, ఓవర్సీలో రూ. 32 లక్షల చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











