Pushpa 2 Day 19 collection : అల్లు అర్జున్‌కు బిగ్‌షాక్ .. దారుణంగా పడిపోయిన పుష్ప2 కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ కనివినీ ఎరుగని స్థాయిలో దుమ్ములేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను నిజం చేస్తూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే స్త్రీ 2, జవాన్, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల రికార్డులను గల్లంతు చేసిన పుష్ప 2 .. రూ.2000 కోట్ల వసూళ్లు దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో 19వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందో ఒకసారి పరిశీలిస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నాలుగు నెలలు ఆలస్యంగా థియేటర్‌లలో దిగింది. అయినప్పటికీ పుష్ప 2 మీదున్న హైప్ కొంచెం కూడా తగ్గలేదు. టీజర్, ట్రైలర్, అల్లు అర్జున్, రష్మిక మందన్నల గెటప్స్ వైరల్ కావడంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు . అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పుష్ప 2. తద్వారా దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి పుష్పగాడి చూపు బాహుబలి 2పైనే ఉంది. లాంగ్ రన్‌లో రాజమౌళి సినిమా రికార్డులను అల్లు అర్జున్ బద్ధలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మూడో వారంలో కాస్త డల్‌గా కనిపించిన పుష్ప 2.. గత వీకెండ్‌లో మాత్రం ఏకంగా రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టి దుమ్ములేపింది. ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పుష్ప 2 ప్రభంజనం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 19వ రోజు కలెక్షన్లు బాగా పడిపోయాయి. పుష్ప 2 విడుదలైన నాటి నుంచి రోజుకు రూ.20 కోట్లు తగ్గకుండా గ్రాస్ వసూళ్లు రాబడుతూ వచ్చింది. అయితే తొలిసారిగా సోమవారం రూ.15 కోట్ల లోపే కలెక్షన్లు దక్కించుకుంది.

తెలుగు రాష్ట్రాలలో రూ.2.68 కోట్లు, హిందీలో రూ.10.13 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 63 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 17 లక్షల చొప్పున మొత్తం రూ.14.07 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో 19 రోజుల వరకు పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ. 1546 కోట్ల కలెక్షన్లను అందుకుంది పుష్ప 2. అల్లు అర్జున్ మూవీకి గట్టి అండగా నిలిచిన హిందీ బెల్ట్‌లో రేపటి నుంచి బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ విడుదల కానుంది. దీంతో పుష్పకు థియేటర్లు తగ్గడంతో పాటు వసూళ్ల పైనా ప్రభావం పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











