Pushpa 2 Day 2 Box Office : కుమ్మిపడేస్తోన్న అల్లు అర్జున్... అప్పుడే 400 కోట్లు , రెండో రోజు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ట్రేడ్ పండితులు చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు సాధ్యం కానీ రీతిలో తొలి రోజు ఏకంగా రూ. 294 కోట్ల ఓపెనింగ్స్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో రెండో రోజు పుష్ప 2 ఎలాంటి వసూళ్లు సాధించింది? ఎన్ని రికార్డులు సృష్టించింది? అంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..
మూడేళ్ల క్రితం 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 యావత్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ ఎప్పుడొస్తుంది? అంటూ తెలుగు ఆడియన్స్‌తో పాటు నార్త్ ఆడియన్స్ ఎదురుచూశారు. దీనికి తెరదించుతూ పుష్ప 2 ది రూల్‌ని తీసుకొచ్చాడు సుకుమార్. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి కుమ్మిపడేసింది పుష్ప 2. తెలుగులో కంటే కూడా హిందీలో సాలీడ్ కలెక్షన్స్‌ను రాబడుతున్నాడు పుష్పరాజ్. హిందీలో ఫస్డ్ టే ఏకంగా రూ. 73 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాలీవుడ్‌ను వణికించాడు అల్లు అర్జున్. రెండో రోజు తెలుగు సహా పలు ప్రాంతాల్లో డ్రాప్స్ కనిపిస్తున్నా.. హిందీలో మాత్రం పుష్పరాజ్ జోరు తగ్గడం లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే నార్త్‌లో పుష్ప 2 ప్రభంజనం ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడది అక్షరాల వర్కవుట్ అవుతోంది.
తొలి రోజు ఓపెనింగ్స్ పరంగా రికార్డు సృష్టించిన పుష్ప 2 .. ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం కొట్టిపాడేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్స్‌ని కొట్టలేకపోయింది. ఆర్ఆర్ఆర్‌కు తొలి రోజు ఆంధ్రా, నైజాంలలో కలిపి రూ.82.15 కోట్లు రాగా.. పుష్ప2కి ఫస్ట్ డే రూ.79 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత దేవర (67 కోట్లు), సలార్ (58 కోట్లు), బాహుబలి2 (47 కోట్లు), గుంటూరు కారం (42.70 కోట్లు) ఉన్నాయి.

ఇక రెండో రోజు పుష్ప 2 ది రూల్ వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లు, హిందీలో రూ. 60 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ. 8 కోట్లు, కేరళ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 కోట్ల చొప్పున ఇండియా వైడ్‌గా రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్‌లో రూ. 20 కోట్ల వసూళ్లు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప 2 రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెండో రోజుల్లోనే పుష్ప 2 ది రూల్ రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











