Pushpa 2 Day 20 collection : వివాదాల్లో అల్లు అర్జున్ .. తగ్గేదే లే అంటోన్న పుష్ఫ 2, 700 కోట్ల సంచలనం
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కొత్త సినిమాలు రంగంలోకి దిగినా, దాదాపు మూడు వారాలు గడుస్తున్నా పుష్ప 2 క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగులో ఏమో కానీ హిందీలో పుష్పరాజ్ ఊచకోత కోస్తున్నాడు. నార్త్ జనాలను అంతలా ఊపేస్తున్న పుష్ప.. అక్కడ కనివినీ ఎరుగని రికార్డులను సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 20వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 బ్రాండ్‌కి తోడు అల్లు అర్జున్ గెటప్స్, టీజర్, ట్రైలర్లు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలో పుష్ప2కి ఎక్కడా లేని హైప్ వచ్చింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు .
ఊహించిన విధంగానే తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పుష్ప 2. తద్వారా దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. దీనితో పాటు ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్.. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు 17 మిలియన్లతో యష్ - ప్రశాంత్ నీల్‌ల కేజీఎఫ్ 2 టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఈ ఘనత అందుకోగా.. పుష్ప కేవలం 19 రోజుల్లోనే 18 మిలియన్ల వరకు టికెట్లు బుక్ అయ్యాయట.
ఇక 20వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.2.74 కోట్లు, హిందీలో రూ.12.41 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 15 లక్షల చొప్పున మొత్తం రూ.16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో 20 రోజుల వరకు పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ. 1563 కోట్ల కలెక్షన్లను అందుకుంది . క్రిస్మస్ కానుకగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ విడుదల కానుండటంతో కొన్ని ఏరియాలలో పుష్ప2కి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే.. తొలి నుంచి పుష్ప2కి సాలీడ్ వసూళ్లను అందిస్తున్న హిందీ మార్కెట్‌లో ఈ సినిమా మరో ఘనతను అందుకుంది. హిందీ వెర్షన్‌లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ2 .. రూ.600 కోట్లు అందుకున్న తొలి హిందీ సినిమాగా నిలవగా.. దానిని పుష్ప 2 బ్రేక్ చేసింది. మొత్తంగా 20 రోజుల వరకు హిందీ ఒక్కచోటే రూ. 710 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతోందోనని ట్రేడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి, బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ని వివాదాల మధ్యలోనూ ఆయన నటించిన సినిమాకు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.


Click it and Unblock the Notifications











