Pushpa 2 Day 22 collection: దారుణంగా పడిపోయిన పుష్ప 2 వసూళ్లు ..తెలుగులో డల్‌గా, హిందీపైనే ఆశలు!
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. తనకు అడ్డొచ్చిన సినిమాలను తొక్కుకుంటూ వెళ్లిపోతున్న అల్లు అర్జున్.. ఇప్పటికే తన పేరిట అనేక రికార్డులను నెలకొల్పుతున్నాడు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచిన పుష్ప 2 .. రూ. 2000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో 22వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మూడేళ్ల క్రితం పుష్ప 1 రిలీజైనప్పుడు ఆ సినిమాలోని మాటలు, పాటలు, డ్యాన్స్‌కి దేశం ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా పుష్ప రాజ్ మేనియాలో పడిపోయారు. క్రికెటర్లు, సెలబ్రెటీలు పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అల్లు అర్జున్ గెటప్స్, టీజర్, ట్రైలర్లు ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా పుష్ప2 ది రూల్‌కి ఎక్కడా లేని హైప్ వచ్చింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు . ఊహించిన విధంగానే తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పుష్ప 2.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలవులు కావడంతో పుష్ప 2కి బాగా కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం 21 రోజుల్లోనే ఏకంగా రూ.1705 కోట్ల వసూళ్లు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఒక్క హిందీలోనే ఏకంగా రూ. 700 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్లు (1800 కోట్లు +) అధిగమించడానికి అడుగు దూరంలో నిలిచింది. లాంగ్ రన్‌లో పుష్ప 2 ఈ ఫీట్ కొట్టేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక 22వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. గురువారం చాలా ఏరియాల్లో పుష్ప 2 కలెక్షన్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.38 కోట్లు, హిందీలో రూ.8.72 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 63 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. అయితే క్రిస్మస్ సెలవులకు తోడు, ఇవాళ్టీ నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











