Pushpa 2 Day 23 collection : పుష్పగాడికి బిగ్ షాక్ .. దారుణం పడిపోయిన కలెక్షన్స్ , ఫస్ట్ టైం గట్టి దెబ్బ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ప్రతి చోట రికార్డులు బద్ధలు కొడుతోంది ఈ సినిమా. 21 రోజుల్లోనే ఏకంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న చిత్రంగా పుష్ప 2 నిలిచింది. మరి 23వ రోజు అల్లు అర్జున్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 23 collections report

మూడేళ్ల క్రితం పుష్ప 1 ప్రభంజనం నేపథ్యంలో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసింది. అల్లు అర్జున్ గెటప్స్, టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా పుష్ప2 ది రూల్‌పై అంచనాలు పీక్స్‌కి చేరాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. అన్ని ఏరియాలలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి విధ్వంసం సృష్టించి ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఈ సినిమా. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచింది పుష్ప 2.

Pushpa 2 The Rule Box Office Day 23 collections report

దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలవులు కావడం, పైగా వీకెండ్ మొదలు కావడంతో పుష్ప 2 మరిన్ని రికార్డులను బద్ధలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్లు (1800 కోట్లు +) బద్ధలు కొట్టడానికి కేవలం కొద్ది దూరంలో నిలిచింది ఈ సినిమా. నాలుగో వారంలోనే అల్లు అర్జున్ ఈ ఫీట్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక 23వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. శుక్రవారం చాలా ఏరియాల్లో పుష్ప 2 కలెక్షన్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 54 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 12 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఇంత తక్కువ స్థాయిలో గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారి. అయితే వీకెండ్ కావడంతో పుష్ప 2 తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X