Pushpa 2 Day 24 collection: మరో రాజమౌళి రికార్డ్‌ను కొట్టేసిన పుష్ప 2 ..అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీలో దాదాపు రూ.700 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ సూపర్‌స్టార్లు నటించిన చిత్రాలనే వెనక్కి నెట్టింది. ఇక 21 రోజుల్లోనే ఏకంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి రికార్డులపై పుష్ప 2 కన్నేసింది. అతి త్వరలోనే రాజమౌళి ఎపిక్ మూవీ రికార్డులను బద్ధలు కొట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. మరి 24వ రోజు అల్లు అర్జున్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 క్రేజ్ నేపథ్యంలో పుష్ప 2 కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 ది రూల్.. నాలుగు నెలలు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. అల్లు అర్జున్ గెటప్స్, టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ బజ్ నెలకొంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచింది పుష్ప 2.

క్రిస్మస్ సెలవులు, వీకెండ్‌లు పుష్ప 2కి బాగా కలిసొస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక 24వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగులో రూ.2.43 కోట్లు, హిందీలో రూ. 10.26 కోట్లు, తమిళనాడు, కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 66 లక్షలు , ఓవర్సీస్‌లో రూ.17 లక్షలు చొప్పున మొత్తంగా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇదిలాఉండగా.. విడుదలైన నాటి నుంచి ఒక్కో టాలీవుడ్ మూవీ రికార్డులను బద్ధలు కొట్టుకుంటూ వెళ్తున్న పుష్ప 2.. తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డును బద్ధలు కొట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ రన్‌లో రూ. 451 కోట్ల బిజినెస్‌కు గాను రూ. 163 కోట్లకు పైగా ప్రాఫిట్‌ను అందించింది. అయితే ఇప్పుడు పుష్ప 2 కేవలం 23 రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ టోటల్ ప్రాఫిట్స్‌ను దాటేసింది. 23 రోజుల్లో 617 కోట్ల బిజినెస్‌కు గాను రూ. 164 కోట్లకు పైగా ప్రాఫిట్‌ను అందుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి లాంగ్ రన్‌లో అల్లు అర్జున్ ఇంకెంత మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











