Pushpa 2 Day 25 collection: వీకెండ్‌లో కుమ్మేసిన అల్లు అర్జున్..టార్గెట్ దిశగా పుష్ప2, అక్షరాల ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 కనివినీ ఎరుగుని రీతిలో ఊచకోత కోస్తోంది. పుష్పపై భారీ అంచనాలు ఉండగా.. ఖచ్చితంగా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అల్లు అర్జున్ రికార్డులను బద్ధలు కొడుతున్నాడు. మూడో వారం ముగుస్తున్నప్పటికీ అదే స్థాయిలో కలెక్షన్స్ కుమ్మేస్తుండటం విశేషం. మరి 25వ రోజు పుష్ప 2 ఎలాంటి వసూళ్లను రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. తెలుగు రాష్ట్రాలకు మించి నార్త్‌లో ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్, టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు.
భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2 ది రూల్. దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజ్ కావడం ఓ ఎత్తయితే.. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఈ కలెక్షన్స్‌ని అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగాను మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది పుష్ప 2. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచింది పుష్ప 2.

ఇక 25వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగులో రూ. 3.10 కోట్లు, హిందీలో రూ. 13 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలలో రూ.కోటి , ఓవర్సీస్‌లో రూ. 17 లక్షలు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. ఆదివారంతో వీకెండ్, క్రిస్మస్ సెలవులు పూర్తి కావడంతో ఇకపై అల్లు అర్జున్ సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కాకపోతే సంక్రాంతి వరకు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడం పుష్ప 2కి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. మరి చూద్దాం అల్లు అర్జున్ లాంగ్ రన్‌లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో.


Click it and Unblock the Notifications











